దసరా దసరా దసరా పెద్దమ్మా పాట లిరిక్స్ | పెద్దమ్మతల్లి (2001)

 చిత్రం : పెద్దమ్మతల్లి (2001)

సంగీతం : దేవా

సాహిత్యం :  

గానం : బాలు, చిత్ర  


దసరా దసరా దసరా పెద్దమ్మా

దయతో ధరలో ధర్మము నిలుపమ్మా

దసరా దసరా దసరా పెద్దమ్మా

దయతో ధరలో ధర్మము నిలుపమ్మా

దివ్య కళా మాలిని అమ్మా శాంతి దాయని

సర్వ కళా శోభిని తల్లీ శక్తి రూపిణి

సంబరాల అంబా కావమ్మా


దసరా దసరా దసరా పెద్దమ్మా

దయతో ధరలో ధర్మము నిలుపమ్మా


అసురులను చెలగ వచ్చితివి

ఆర్తులను కావగ నిల్చితివి

కోరి కోరి కోర్కెల తీర్చ కొలువైతివే

మమతలు చిందేటి మాయమ్మవే

ఎల్లరము ఏలే ఎల్లమ్మవే

వెల్లువల్లే వెతనలనార్చు బోనాలమ్మవే

కన్నుల వెన్నెల కామాక్షి నువ్వే

కాంతుల కలల కాలాగ్ని నువ్వే

మాటల మధువుల మాలక్ష్మి నువ్వే

సౌందర్య లహరుల అరి సోదరి నువ్వే

సరిసాటీ లేనే లేని సర్వమాతవే

ఇలలను బ్రోచే పెద్దమ్మా


దసరా దసరా దసరా పెద్దమ్మా

దయతో ధరలో ధర్మము నిలుపమ్మా


మరులను మర్ధన చేసెదవే

మైకంబుల భంజన చేసెదవే

ఆంక్షలన్నీ బలులు చేసి అర్పించెదమే

దుష్టులకు ధూపము వేసెదవే

భక్తులను ప్రీతిగ కాచెదవే

అష్టమైన ఆయుధ పూజ అలరించెదమే

కాళివె చండీ భైరవి నువ్వే

ఏలెడి అంబ శాంభవి నువ్వే

మహర్నవమి పూజలతో పులకరించి నేడు

రాజిల్లే విజయదశమి చిందేసీ ఆడు

దేవీ ఘన మహా శక్తి తల్లీ కాపాడూ

నమ్మితిమి నిన్నే నమ్మమ్మా


దసరా దసరా దసరా పెద్దమ్మా

దయతో ధరలో ధర్మము నిలుపమ్మా

దివ్య కళా మాలిని అమ్మా శాంతి దాయని

సర్వ కళా శోభిని తల్లీ శక్తి రూపిణి

సంబరాల అంబా కావమ్మా


Share This :

Related Post



sentiment_satisfied Emoticon

:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
-_-
(o)
[-(
:-?
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
$-)
(y)
(f)
x-)
(k)
(h)
(c)
cheer
(li)
(pl)