తికమక మకతిక పరుగులు ఎటుకేసి పాట లిరిక్స్ | శ్రీ ఆంజనేయం (2004)


చిత్రం : శ్రీ ఆంజనేయం (2004)

సంగీతం : మణిశర్మ

సాహిత్యం : సిరివెన్నెల సీతారామ శాస్త్రీ

గానం : ఎస్.పి. బాల సుబ్రహ్మణ్యం


తికమక మకతిక పరుగులు ఎటుకేసి

నడవరా నరవరా నలుగురితో కలిసి

శ్రీ రామచందురుణ్ణి కోవెల్లో ఖైదుచేసి

రాకాసి రావణున్ని గుండెల్లో కొలువు చేసి

తలతిక్కల భక్తితో తైతక్కలా మనిషీ

తై దిదితై దిదితై దిదితై- దిదితై దిదితై దిదితై

దిదితై దిదితై దిదితై- దిదితై దిదితై దిది

 

తికమక మకతిక పరుగులు ఎటుకేసి

నడవరా నరవరా నలుగురితో కలిసి


వెతికే మజిలీ దొరికే దాకా

కష్టాలు నష్టాలు ఎన్నొచ్చినా క్షణమైన నిన్నాపునా

కట్టాలి నీలోని అన్వేషణ కన్నీటిపై వంతెన

బెదురంటు లేని మది ఎదురుతిరిగి అడిగేనా

బదులంటూ లేని ప్రశ్నలేదు లోకాన

నీ శోకమే శ్లోకమై పలికించరా మనిషీ….

తై దిదితై దిదితై దిదితై


తికమక మకతిక పరుగులు ఎటుకేసి

నడవరా నరవరా నలుగురితో కలిసీ


అడివే అయినా కడలే అయినా

ధర్మాన్ని నడిపించు పాదాలకి శిరసొంచి దారీయదా

అటువంటి పాదాల పాదుకలకి పట్టాభిషేకమే కదా

ఆ రామగాథ నువు రాసుకున్నదే కాదా

అది నేడు నీకు తగుదారి చూపనందా

ఆ అడుగుల జాడలు చెరపొద్దురా మనిషీ….

తై దిది తరికిటతోం- తరికిటతోం తరికిటతోం తత్తోం


తికామక తిక తికమక మకతిక పరుగులు ఎటుకేసి

నడవరా నరవరా నలుగురితో కలిసి


Share This :

Related Post



sentiment_satisfied Emoticon

:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
-_-
(o)
[-(
:-?
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
$-)
(y)
(f)
x-)
(k)
(h)
(c)
cheer
(li)
(pl)