చిత్రం : చూడాలనివుంది (1998)
సంగీతం : మణిశర్మ
సాహిత్యం :
గానం : బాలు, చిత్ర
సింబలే సింబలే అంబరాలు అందెలే హాయిలే
బల్ బలే బల్ బలే చేతికందే మాకు వెండి మబ్బులే
వెన్నెలమ్మా వేటకొచ్చే ఏనుగమ్మ అంబారిలో
తేనెలమ్మా త్రేనుపొచ్చే మల్లెజాజి మందారిలో
సింబలే సింబలే అంబరాలు అందెలే హాయిలే
బల్ బలే బల్ బలే చేతికందే మాకు వెండి మబ్బులే
చందమామా తీసుకొచ్చే సబ్బుబిళ్ల నేనులెమ్మనీ
చంద్రవంక వాగుపొంగే స్నానమాడ నిన్నురమ్మనీ
పిల్లనెమలి సంబరం సింబలే సింబలే
పింఛమెంత సుందరం సింబలే సింబలే
పట్నమన్న పంజరం పట్టువీడి పావురం
ఈ గూటికొచ్చే కాపురం హొయిలాలో హొయిలాలో
సింబలే సింబలే అంబరాలు అందెలే హాయిలే
బల్ బలే బల్ బలే చేతికందే మాకు వెండి మబ్బులే
ఆకాశాలే నేలకొచ్చే మేడకన్నా నీడ మేలని
ఆనందాల వెల్లువచ్చి లాలపోసే కంటిపాపకి
చూడ చూడ వింతలు సింబలే సింబలే
చుక్కలేడి గంతులు సింబలే సింబలే
ఆకుపచ్చ పొద్దులు మాకులేవు హద్దులు
ఈ కొండకోన సీమలో హొయిలాలో హొయిలాలో
సింబలే సింబలే అంబరాలు అందెలే హాయిలే
బల్ బలే బల్ బలే చేతికందే మాకు వెండి మబ్బులే
వెన్నెలమ్మా వేటకొచ్చే ఏనుగమ్మ అంబారిలో
తేనెలమ్మా త్రేనుపొచ్చే మల్లెజాజి మందారిలో
comment 0 comments:
more_vertsentiment_satisfied Emoticon