చిత్రం : బాహుబలి ది కంక్లూజన్ (2017)
సంగీతం : ఎమ్.ఎమ్.కీరవాణి
సాహిత్యం : కీరవాణి
గానం : శ్రీనిధి, వి. శ్రీసౌమ్య
మురిపాల ముకుందా...
సరదాల సనందా...
మురిపాల ముకుందా - సరదాల సనందా
మురిపాల ముకుందా - సరదాల సనందా
పొద పొద లోన దాగుడు ముతలాపరా
ఎద ఎద లోన నర్తించింది చాలురా
అలసట నిను కోరి నిలుచుందిరా
కన్నా నిదురించరా
నా కన్నా నిదురించరా
చిటెకెన వేలిని కొండని మోసిన
కన్నా నిదురించరా
నా కన్నా నిదురించరా
చిలికిన చల్లల కుండలు దోచిన
కన్నా నిదురించరా
నా కన్నా నిదురించరా
కన్నా నిదురించరా
నా కన్నా నిదురించరా
గోపెల వలువలతో చెలగి అలసేవేమో
గోముగ శయనించు
ఉంగిలి వెన్నలకై ఉరికే ఉబలాటముకే
ఊరట కలిగించు
శ్యామనా... నా మోహన
చాలు చాలు నీ అట మటలు
పవళించక తీరవు అలసటలు
విరిసే మదిలో విరిశయ్యలు
కన్నా నిదురించరా
నా కన్నా నిదురించరా
కన్నా నిదురించరా
నా కన్నా నిదురించరా
నెర నెర చూపులకే కరిగి కదిలి
నీకై బిర బిర వచ్చితినే
తడి తడి కన్నులతో నీపై వాలి సోలి
తమకము తెలిపితినే
మాధవా... యాదవా...
నా మతి మాలి దోసము జరిగే
ఓ వనమాలి ఎద్దు నిన్ను పొడిచే
పాపం అంతా నాదేనురా...
కన్నా నిదురించరా
నా కన్నా నిదురించరా
కన్నా నిదురించరా
నా కన్నా నిదురించరా
మురిపాల ముకుందా సరదాల సనందా
మురిపాల ముకుందా సరదాల సనందా
మధనా మధుసూధన మనోహర మన్మోహన
మధనా మధుసూధన మనోహర మన్మోహన
మురిపాల ముకుందా సరదాల సనందా
కన్నా... కన్నా... కన్నా..
ఆనందా... అనిరుద్దా...
ఆనందా... అనిరుద్దా...
మురిపాల ముకుందా సరదాల సనందా
కన్నా... రాధా రమణ
కన్నా... నిదురించరా
comment 0 comments:
more_vertsentiment_satisfied Emoticon