చిత్రం : ఆత్మీయులు (1969)
సంగీతం : సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం : శ్రీశ్రీ
గానం : ఘంటసాల, సుశీల
కళ్ళలో పెళ్ళిపందిరి కనబడసాగే
పల్లకిలోన ఊరేగే ముహూర్తం మదిలో కదలాడే
కళ్ళలో పెళ్ళిపందిరి కనబడసాగే
పల్లకిలోన ఊరేగే ముహూర్తం మదిలో కదలాడే
నుదుట కళ్యాణ తిలకముతో
పసుపుపారాణి పదములతో
నుదుట కళ్యాణ తిలకముతో
పసుపుపారాణి పదములతో
పెదవిపై మెదిలే నగవులతో
వధువు నను ఓరగ చూస్తుంటే...
జీవితాన పూలవానా
కళ్ళలో పెళ్ళిపందిరి కనబడసాగే
పల్లకిలోన ఊరేగే ముహూర్తం మదిలో కదలాడే
సన్నాయి చల్లగా మ్రోగి
పన్నీటి జల్లులే రేగి
సన్నాయి చల్లగా మ్రోగి
పన్నీటి జల్లులే రేగి
మనసైన వరుడు దరిచేరి
మెడలోన తాళి కడుతూంటే...
జీవితాన పూలవానా
కళ్ళలో పెళ్ళిపందిరి కనబడసాగే
పల్లకిలోన ఊరేగే ముహూర్తం మదిలో కదలాడే
వలపు హృదయాలు పులకించి
మధుర స్వప్నాలు ఫలియించి
వలపు హృదయాలు పులకించి
మధుర స్వప్నాలు ఫలియించి
లోకమే వెన్నెలవెలుగైతే
భావియే నందన వనమైతే
జీవితాన పూలవానా
కళ్ళలో పెళ్ళిపందిరి కనబడసాగే
పల్లకిలోన ఊరేగే ముహూర్తం మదిలో కదలాడే
ఆహ హ హ హా..ఆహా హ హా..
ఆహ హ హ హా..ఆహా హ హా..
comment 0 comments:
more_vertsentiment_satisfied Emoticon