గొల్లవారి వాడలోన పాట లిరిక్స్ | కృష్ణలీలలు (1959)



చిత్రం : కృష్ణలీలలు (1959)

సంగీతం : సుసర్ల దక్షిణామూర్తి

సాహిత్యం : కొసరాజు

గానం : మాధవపెద్ది, స్వర్ణలత


గొల్లవారి వాడలోన చిన్నిక్రిష్ణమ్మా

చల్లనయ్యా పుట్టినాడే చిన్ని క్రిష్ణమ్మా

గొల్లవారి వాడలోన చిన్నిక్రిష్ణమ్మా

చల్లనయ్యా పుట్టినాడే చిన్ని క్రిష్ణమ్మా


మా పాలి దేవుడై పుట్టాడురా

రేపల్లెకే వన్నె తెచ్చాడురా

ఆపదలు కాయంగ వచ్చాడురా వచ్చాడురా

ఆపదలు కాయంగ వచ్చాడురా

అందరికీ ఆనందమిచ్చాడురా

 

గొల్లవారి వాడలోన చిన్నిక్రిష్ణమ్మా

చల్లనయ్యా పుట్టినాడే చిన్ని క్రిష్ణమ్మా


ఒహొ చిన్నారి పొన్నారి చిన్నవాడు

కళ్లల్లో మెరిసేటి అందగాడు ఒహ్ చిన్నారి

ఒహ్ చిన్నారి పొన్నారి చిన్నవాడు

కళ్లల్లో మెరిసేటి అందగాడు

నవ్వుల్లో పువ్వుల్లు చల్లువాడు ఓఓఓఓఓ

నవ్వుల్లో పువ్వుల్లు చల్లువాడు

నందయ్య ఇలవేల్పు నల్లవాడు 


గొల్లవారి వాడలోన చిన్నిక్రిష్ణమ్మా

చల్లనయ్యా పుట్టినాడే చిన్ని క్రిష్ణమ్మా


తందనాల పాటలు పాడండయ్యా

తప్పెట్లు తాళాలు కొట్టండయ్యా

శివమెత్తి సుద్దులు చెప్పండయ్యా

చిందులేసి సంబరాలు చేయండయ్యా


గొల్లవారి వాడలోన చిన్నిక్రిష్ణమ్మా

చల్లనయ్యా పుట్టినాడే చిన్ని క్రిష్ణమ్మా

 

Share This :

Related Post



sentiment_satisfied Emoticon

:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
-_-
(o)
[-(
:-?
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
$-)
(y)
(f)
x-)
(k)
(h)
(c)
cheer
(li)
(pl)