ఆకాశవీధులలోన వినిపించింది ఓ మౌనగీతం పాట లిరిక్స్ | రాజు రాణి జాకి (1983)



చిత్రం : రాజు రాణి జాకి (1983)

సంగీతం : రాజన్-నాగేద్ర

సాహిత్యం : వేటూరి

గానం : బాలు, సుశీల


ఆకాశవీధులలోన వినిపించింది ఓ మౌనగీతం

ఆ గీతమంతా పలికించే అనురాగాలు మనకోసం


ఆకాశవీధులలోన వినిపించింది ఓ మౌనగీతం

ఆ గీతమంతా పలికించే అనురాగాలు మనకోసం 

ఆకాశవీధులలోన వినిపించింది ఓ మౌనగీతం


మందార మకరందాలే కురిసింది సుందరహాసం

మందార మకరందాలే కురిసింది సుందరహాసం

మమతలే పరిమళమై హృదయాలు పరవశమై


ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ

శృంగార సుమభాణాలే విసిరింది సంధ్యారాగం

శృంగార సుమభాణాలే విసిరింది సంధ్యారాగం

ప్రణయమే ప్రణవమనే అందాల అనుభవమే..ఏ

ఈ చైత్రవేళలలోన ఆలాపనై

 

ఆకాశవీధులలోన వినిపించింది ఓ మౌనగీతం


నా లేత యవ్వనమల్లె విరిసింది మల్లెలమాసం

నా లేత యవ్వనమల్లె విరిసింది మల్లెలమాసం

మనసులే తనువులుగా మధుమాస కోకిలలై 

ఆ ఆ ఆ ఆ హ్హా ఆ ఆ ఆ ఓ ఓ ఓ

నా కొంటె కోరికలేవొ కొసరింది తుమ్మెద నాదం

నా కొంటె కోరికలేవొ కొసరింది తుమ్మెద నాదం

పరువమే స్వరములుగా సనజాజి సంకెలలై

హేమంత రాత్రులలోన..హిమవీణలై


ఆకాశవీధులలోన వినిపించింది ఓ మౌనగీతం

ఆ గీతమంతా పలికించే అనురాగాలు మనకోసం

ఆకాశవీధులలోన వినిపించింది ఓ మౌనగీతం


Share This :

Related Post



sentiment_satisfied Emoticon

:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
-_-
(o)
[-(
:-?
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
$-)
(y)
(f)
x-)
(k)
(h)
(c)
cheer
(li)
(pl)