సరి సరి పద పద నీ పాట లిరిక్స్ | రెండుజెళ్ళ సీత (1983)



చిత్రం : రెండుజెళ్ళ సీత (1983)

సంగీతం : రమేష్ నాయుడు

సాహిత్యం : వేటూరి

గానం : జానకి, కోరస్ 


సరి సరి పద పద నీ

నీ సరి ఎవరిక అవనీ

నీ దనీ మది నీదనీ

నీ దరి చేరగ తొందర సేయగా ఆఆ..


సరి సరి పద పద నీ

నీ సరి ఎవరిక అవనీ


అక్షర సుమాలు నావై

స్వర లక్షణ సూత్రము నీవై

సరిగమపదనిస

సనిదపమగరిస

సప్తవర్ణముల గాన లహరిలో

ఇంధ్రధనుసుగా నా సొగసు

ఇలకు చేరగా నీ కొరకు

సరిగమపదనిస సా సా

సరిగమపదనిస సా సా

దనిసనిసరిదప సనిదప మగరిస

దనిసనిసరిదప సనిదప మగరిస


సరి సరి పద పద నీ

నీ సరి ఎవరిక అవనీ

నీ దనీ మది నీదనీ

నీ దరి చేరగ తొందర సేయగా ఆఆ..


సరి సరి పద పద నీ

నీ సరి ఎవరిక అవనీ


సరిసరి నటనల అందియనై

సరసానికి వ్రేపల్లియనై

వేణు వీధిలో వేసవి గాలిని నేనై

విరహిణినై స్వరధునినై రసనదినై

పొంగిపొరలి నే వస్తున్నా

నింగినేల ముడి వేస్తున్నా

సరిగమ సమగరి సరిగమపదనిస

సరిగమ సమగరి సరిగమపదనిస

సనిదప సపదని సనిదపమగరిస

సనిదప సపదని సనిదపమగరిస


సరి సరి పద పద నీ

నీ సరి ఎవరిక అవనీ

నీ దనీ మది నీదనీ

నీ దరి చేరగ తొందర సేయగా ఆఆ..


సరి సరి పద పద నీ

నీ సరి ఎవరిక అవనీ


పులిలా చూడకు ప్రియా

భీతహరిణి నేత్రిని నేను

పులిలా చూడకు సఖా

ప్రాణ శిల్ప ధాత్రిని నేను

ప్రియా...ఆఆఅ... సఖా...ఆఆఆ

చలిగా చూస్తే నెచ్చెలిని

చెలిగా నీలో సగమవుతాను

చెలిమై నీకూ సఖినౌతానూ

సపమపగమరిగ సపమపగమరిగ

సరిగమపదనిస సరిగమపదనిస

పసనిసదనిమద పసనిసదనిమద

సనిదపమగరిస సనిదపమగరిస


సరి సరి పద పద నీ

నీ సరి ఎవరిక అవనీ

నీ దనీ మది నీదనీ

నీ దరి చేరగ తొందర సేయగా ఆఆ..


సరి సరి పద పద నీ

నీ సరి ఎవరిక అవనీ


సనజాజి వానల్లో సంపంగి వరదల్లో

తేనెలో తడిసాను తీపిలో మునిగాను

నీ చూపు వేడిలో తడి ఆర్చుకున్నాను

నచ్చింది మనువు పిల్లకీ భల్ అందగాడా

నచ్చింది మల్లెల పల్లకీ 


Share This :

Related Post



sentiment_satisfied Emoticon

:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
-_-
(o)
[-(
:-?
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
$-)
(y)
(f)
x-)
(k)
(h)
(c)
cheer
(li)
(pl)