చిత్రం : పెళ్ళిపీటలు (1998)
సంగీతం : ఎస్వీ కృష్ణారెడ్డి
సాహిత్యం : చంద్రబోస్
గానం : మనో, నిత్యసంతోషిణి, బృందం
పెళ్ళి పీటలు పెళ్ళి పాటలు స్వాగతమన్నాయి
పెళ్ళి పల్లకీ పెళ్ళి పందిరి సిద్ధంగున్నాయి
మేళమే మోగగా మారనా ఆలిగా
వేద బ్రాహ్మణులు వేల బంధువులు
వేచి ఉన్న సమయంలో
పెళ్ళి పీటలు పెళ్ళి పాటలు స్వాగతమన్నాయి
పెళ్ళి పల్లకీ పెళ్ళి పందిరి సిద్ధంగున్నాయి
సప్తవర్ణములతో తమాషగ నడిచాయి రంగవల్లు
హోయ్ రంగవల్లులు హోయ్ రంగవల్లులు
హోయ్ రంగవల్లులు హోయ్ రంగవల్లులు
సప్తపదిని కనగా అదిగో
మండపాన మావిడాకు మెరిసే
అష్టపదులు పలుకా ఇదిగో
ఇంటిముందు కొబ్బరాకు నిలిచే
కర్పూరము పన్నీటి కలశం
ఖర్జూరము పారాణి పాదం
తాళిబొట్టు జిలకర్ర బెల్లం
వేచివుంది వేదమంత్ర గానం
ప్రేమ సాక్షులం అక్షతలే వేసేస్తాం
పెళ్ళి సాక్షిగా అశీస్సే అందిస్తాం
శుభలగ్నం తిలకిస్తాం శుభమస్తు దీవిస్తాం
ప్రేమసాక్షులం
పెళ్ళి పీటలు పెళ్ళి పాటలు స్వాగతమన్నాయి
పెళ్ళి పల్లకీ పెళ్ళి పందిరి సిద్ధంగున్నాయి
ఈడు జోడు చూసి హుషారుగ కురిశాయి తేనెజల్లులు
హాయ్ తేనెజల్లులు హోయ్ తేనెజల్లులు
హాయ్ తేనెజల్లులు హోయ్ తేనెజల్లులు
విడిది వారికోసం అదిగో
దప్పళాలు అప్పడాలు దోశలు
విందు భోజనార్థం ఇదిగో
చక్కిలాలు బాదుషాలు బూరెలు
నేతిగారెలు జాంగ్రీలు లడ్లు
తీపి అరిసెలు వడియాలు వడలు
ముద్దపప్పు ఆవకాయ పెరుగు
జీడిపప్పు మునక్కాయ పులుసు హో..
పెళ్ళిభోజనం ఇవ్వాళే తయ్యారే
విందుభోజనం వహ్వారే నోరూరే
కడుపారా తినరారే తినిపోదాం మన ఊరే
పెళ్ళి భోజనం..
పెళ్ళి పీటలు పెళ్ళి పాటలు స్వాగతమన్నాయి
పెళ్ళి పల్లకీ పెళ్ళి పందిరి సిద్ధంగున్నాయి
మేళమే మోగగా మారనా ఆలిగా
వేద బ్రాహ్మణులు వేల బంధువులు
వేచి ఉన్న సమయంలో
comment 0 comments:
more_vertsentiment_satisfied Emoticon