చిత్రం : మరోచరిత్ర (1978)
సంగీతం : ఎం.ఎస్. విశ్వనాథన్
సాహిత్యం : ఆత్రేయ
గానం : సుశీల, కమల్ హాసన్
ఏ తీగ పువ్వునో ఏ కొమ్మ తేటినో కలిపింది
ఏ వింత అనుభంధ మౌనో
అప్పడి అన్నా.. అర్థం కాలేదా
ఏ తీగ పూవునొ ఏ కొమ్మ తేటినో కలిపింది
ఏ వింత అనుభందమౌనో
తెలిసీ తెలియని అభిమానమౌనో
మనసు మూగది మాటలు రానిది
మమత ఒకటే అది నేర్చినది..
మనసు మూగది మాటలు రానిది
మమత ఒకటే అది నేర్చినది..
ఆహా..అప్పిడియా..
పెద్ద అర్థమయినట్లు
భాషలేనిది బంధమున్నది
మన ఇద్దరినీ జత కూర్చినది
మన ఇద్దరినీ జత కూర్చినది
ఏ తీగ పూవునొ ఏ కొమ్మ తేటినో కలిపింది
ఏ వింత అనుభందమౌనో
తెలిసీ తెలియని అభిమానమౌనో
వయసే వయసును పలకరించినది
వలదన్నా అది నిలువకున్నది
ఏయ్..నీ రొంబ..అళహాయిరుక్కే
ఆ....రొంబ....అంటే
ఎల్లలు ఏవీ ఒల్లనన్నది
నీదీ నాదోక లోకమన్నది
నీదీ నాదోక లోకమన్నది
ఏ తీగ పూవునొ ఏ కొమ్మ తేటినో కలిపింది
ఏ వింత అనుభందమౌనో
తెలిసీ తెలియని అభిమానమౌనో
తొలిచూపే నను నిలవేసినది
మరుమాపై అది కలవరించినది
నల్ల పొణ్ణు..అంటే నల్ల పిల్ల
మొదటి కలయికే ముడివేసినది
తుది దాకా ఇది నిలకడైనది
తుది దాకా ఇది నిలకడైనది
ఏ తీగ పూవునొ ఏ కొమ్మ తేటినో కలిపింది
ఏ వింత అనుభందమౌనో
తెలిసీ తెలియని అభిమానమౌనో
comment 0 comments:
more_vertsentiment_satisfied Emoticon