ఇల్లే ఇలలో స్వర్గమనీ పాట లిరిక్స్ | ఇల్లు-ఇల్లాలు (1972)

 చిత్రం : ఇల్లు-ఇల్లాలు (1972)

సంగీతం : కె.వి. మహదేవన్

సాహిత్యం : అప్పలాచార్య

గానం : బాలు,  సుశీల  


ఇల్లే ఇలలో స్వర్గమనీ ఇల్లాలే ఇంటికి దేవతనీ

ఋజువు చేశావూ.. నీవు ఋజువు చేశావు

మనసే మనిషికి అందమనీ మగడే శ్రీమతి దైవమనీ 

ఋజువు చేశావూ.. నీవు ఋజువు చేశావు


మైకమనే చీకటిలో మమత కోసమై వెదికాను

మైకమనే చీకటిలో మమత కోసమై వెదికాను

కాంతి కిరణమై కనిపించీ.. జీవన జ్యోతిని వెలిగించావు

అందముగా అందానికి ఒక బంధముగా

అందముగా అందానికి ఒక బంధముగా

తొలినోముల ఫలమై దొరికావు.. నను వీడని నీడై నిలిచావు  


ఇల్లే ఇలలో స్వర్గమనీ.. ఇల్లాలే ఇంటికి దేవతనీ

ఋజువు చేశావూ.. నీవు ఋజువు చేశావు


చల్లని కన్నులలో వెలిగే వెన్నెల దీపాలూ

నా చిరునవ్వుకు ప్రాణాలు..  మన ప్రేమకు ప్రతిరూపాలూ

నీ పెదవుల రాగములో విరిసే తీయని భావాలు

ఆనందానికి దీవెనలు.. మన అనుబంధానికి హారతులూ 


మనసే మనిషికి అందమనీ.. మగడే శ్రీమతి దైవమనీ

ఋజువు చేశావూ.. నీవు ఋజువు చేశావు


నాలో సగమై నీవే జగమై.. నేనే నీవుగ మారావు..

నాలో సగమై నీవే జగమై.. నేనే నీవుగ మారావు

మారని మనిషిని మార్చావు..  బ్రతుకే పండుగ చేశావు

పెన్నిధివై అనురాగానికి సన్నిధివై..

కనులముందు వెలిశావు..నా కలలకు రూపం ఇచ్చావు    


ఇల్లే ఇలలో స్వర్గమనీ.. ఇల్లాలే ఇంటికి దేవతనీ

ఋజువు చేశావూ..  నీవు ఋజువు చేశావు

అహహ హాహాహాహా.. అహహ హాహాహాహా..

లలలలాలలలా.. లలలలాలలలా


Share This :

Related Post



sentiment_satisfied Emoticon

:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
-_-
(o)
[-(
:-?
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
$-)
(y)
(f)
x-)
(k)
(h)
(c)
cheer
(li)
(pl)