తనువా.. హరిచందనమే పాట లిరిక్స్ | కథానాయకురాలు (1970)

 


చిత్రం : కథానాయకురాలు (1970)

సంగీతం : ఆకుల అప్పల రాజ్

సాహిత్యం : విజయ రత్నం 

గానం : బాలు, సుశీల


తనువా.. హరిచందనమే..

పలుకా..ఉహు.. అది మకరందమే


తనువా... ఉహు.. హరిచందనమే..

పలుకా.. ఉహు.. అది మకరందమే..

కుసుమాలు తాకగనే.. నలిగేను కాదా ఈ మేను

నలిగేను కాదా నీ మేను

 

తనువా...ఉహు.. హరిచందనమే..

పలుకా..ఉహు.. అది మకరందమే..

కుసుమాలు తాకగనే.. నలిగేను కాదా ఈ మేను

నలిగేను కాదా నీ మేను


తనువా ఉహు..హరిచందనమే..

 

నీ సోయగాలు కనుసైగ చేసే..

అనురాగ లతలు బంధాలు వేసే

ఉహు.. హ.. ఓహో 

నీ సోయగాలు కనుసైగ చేసే..

అనురాగ లతలు బంధాలు వేసే


హరివిల్లునై ఈ విరి బాణమే

హరివిల్లునై ఈ విరి బాణమే

గురి చూసి హృదయాన విసిరేయనా..

నిను చేరనా.. ఊ.. మురిపించనా.. 

తనువా...ఉహు.. హరిచందనమే..

పలుకా..ఉహు.. అది మకరందమే..

కుసుమాలు తాకగనే.. నలిగేను కాదా ఈ మేను

నలిగేను కాదా నీ మేను


నీకోసమే ఈ నవ పారిజాతం..

విరబూసి నీముందు నిలచిందిలే..

ఆ...ఆ...ఆ...

నీకోసమే ఈ నవ పారిజాతం..

విరబూసి నీముందు నిలచిందిలే


మధుపాయినై మరులూరించనా

మధుపాయినై మరులూరించనా

ఉయ్యాల జంపాలలూగించనా..

లాలించనా.. ఆ.. పాలించనా


తనువా... ఉహు.. హరిచందనమే..

పలుకా.. ఉహు.. అది మకరందమే..

కుసుమాలు తాకగనే.. నలిగేను కాదా ఈ మేను

నలిగేను కాదా నీ మేను 

Share This :



sentiment_satisfied Emoticon