నల్లని వాడైనా ఓ చెలీ చల్లని వాడేలే పాట లిరిక్స్ | శ్రీ కృష్ణ పాండవీయం (1966)

 చిత్రం : శ్రీ కృష్ణ పాండవీయం (1966)

సంగీతం : టి.వి.రాజు

సాహిత్యం : సముద్రాల రాఘవాచార్య

గానం : జిక్కీ, కోమల బృందం


నల్లని వాడైనా ఓ చెలీ చల్లని వాడేలే

నల్లని వాడైనా ఓ చెలీ చల్లని వాడేలే

గోవుల గాచెడి వాడైనా 

నీ గొప్పకు తగ్గని వాడే చెలీ 


నల్లని వాడైనా ఓ చెలీ చల్లని వాడేలే

నల్లని వాడైనా ఓ చెలీ చల్లని వాడేలే

 

మురళీ మోహనుని చెలీ 

మురిపించిన జాణవులే  

మురళీ మోహనుని చెలీ 

మురిపించిన జాణవులే  

మా గోపాలుని ఇల్లాలివవుట..ఆఆ..

మా గోపాలుని ఇల్లాలివవుట

 నీ భాగ్యమే భాగ్యము

ఇలవేలుపులౌ మిమ్ముల జూచి 

తరియించెను మా జన్మలే 


నల్లని వాడైనా ఓ చెలీ చల్లని వాడేలే

నల్లని వాడైనా ఓ చెలీ చల్లని వాడేలే


మనసే పందిరియై చెలీ 

నీ వలపులు పూలతలై 

మనసే పందిరియై చెలీ 

నీ వలపులు పూలతలై 

అనురాగాలే పరిమళించి ఆఆ..ఆఅ..

అనురాగాలే పరిమళించి 

ఆనందము నీయగా 

మీ ప్రియగాధ యుగ యుగాలకు 

కథగా నిలుచునులే ఓ చెలీ 


నల్లని వాడైనా ఓ చెలీ చల్లని వాడేలే

నల్లని వాడైనా ఓ చెలీ చల్లని వాడేలే

గోవుల గాచెడి వాడైనా 

నీ గొప్పకు తగ్గని వాడే చెలీ 


నల్లని వాడైనా ఓ చెలీ చల్లని వాడేలే

నల్లని వాడైనా ఓ చెలీ చల్లని వాడేలే

Share This :

Related Post



sentiment_satisfied Emoticon

:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
-_-
(o)
[-(
:-?
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
$-)
(y)
(f)
x-)
(k)
(h)
(c)
cheer
(li)
(pl)