చిత్రం : మౌనరాగం (1987)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : రాజశ్రీ
గానం : జానకి
ఓహో మేఘమొచ్చెను.. ఏదో లాలి పాడెను..
చినుకే పూల గాలులే.. పలికె పసిడి గాథలే..
పువ్వులపై అందాలే వరహాలను పరిచేను
జల్లులు కురిసే సమయం ముచ్చటలే విరిసేను
ఓహో మేఘమొచ్చెను.. ఏదో లాలి పాడెను..
నాలో ఊగేను సోయగం
రేగే ఊరేగే ఆశలే
నన్నే ఉడికించేనే బృందావనం
వయసు బంధాలు మీరెనే
ఈ పన్నీటిలో గారాలే చిందవా
ఓ అందాల గనికి పూమాలే వెయ్యరా
ఈ అమ్మాయికి పెళ్ళి ఓ నాటకం
ఈ ఒయ్యారమంతా వలపించే జ్ఞాపకం
పులకరించి పలకరించెనే...
ఓహో మేఘమొచ్చెను.. ఏదో లాలి పాడెను..
కలలో ఈ నాటి జీవితం
ఆమని రాగాల బంధనం
వెండి మేఘాలలో ఊరేగుదాం
మధుర సంగీతం పాడుదాం
లే చిగురాకులై ఈనాడు మారుదాం
రా వినువీధిలోన నవ్వుల్లో పాకుదాం
ఈ పరువాలలోన శంఖాలై ఊగుదాం
రయ్ సెలయేరులై ఉరికురికి పొంగుదాం
ఇంత వింత వగలు పంచగా...
ఓహో మేఘమొచ్చెను.. ఏదో లాలి పాడెను..
చినుకే పూల గాలులే.. పలికె పసిడి గాథలే..
పువ్వులపై అందాలే వరహాలను పరిచేను
జల్లులు కురిసే సమయం ముచ్చటలే విరిసేను
ఓహో మేఘమొచ్చెను.. ఏదో లాలి పాడెను..
comment 0 comments:
more_vertsentiment_satisfied Emoticon