కాస్తందుకో దరఖాస్తందుకో పాట లిరిక్స్ | రెండు రెళ్ళు ఆరు (1986)

 చిత్రం : రెండు రెళ్ళు ఆరు (1986)

సంగీతం : రాజన్-నాగేంద్ర

సాహిత్యం : వేటూరి

గానం : ఎస్.పి.బాలసుబ్రమణ్యం, ఎస్.జానకి


కాస్తందుకో .. దరఖాస్తందుకో .. ప్రేమ దరఖాస్తందుకో

ముద్దులతోనే.. ముద్దర వేసి .. ప్రేయసి కౌగిలి అందుకో


ఆ .. కాస్తందుకో..దరఖాస్తందుకో.. భామ దరఖాస్తందుకో

దగ్గర చేరి.. దస్కతు చేసి .. ప్రేయసి కౌగిలి అందుకో


కాస్తందుకో..దరఖాస్తందుకో.. 

ప్రేమ దరఖాస్తందుకో


చిరుగాలి దరఖాస్తు .. లేకుంటె కరిమబ్బు

చిరుగాలి దరఖాస్తూ .. లేకుంటె కరిమబ్బూ

మెరుపంత నవ్వునా .. చినుకైన రాలునా

ఆఆఆ.ఆఆఆఆ...ఆఆఆఆఅహాహా..  

జడివాన దరఖాస్తు .. పడకుంటె సెలయేరు

జడివాన దరఖాస్తూ .. పడకుంటె సెలయేరూ

వరదల్లె పొంగునా..కడలింట చేరునా

శుభమస్తు అంటే .. దరఖాస్తు ఓకే !


కాస్తందుకో..ఆఆ..దరఖాస్తందుకో..  

హహ.. భామ దరఖాస్తందుకో


చలిగాలి దరఖాస్తు .. తొలిఈడు వినకుంటె

చలిగాలి దరఖాస్తూ .. తొలిఈడు వినకుంటే

చెలి జంట చేరునా .. చెలిమల్లె మారునా

ఆఆఆఆఆహాహ్హా...ఆఆఆఆ లాలలలా...

నెలవంక దరఖాస్తు .. లేకుంటె చెక్కిళ్ళు

నెలవంక దరఖాస్తూ .. లేకుంటె చెక్కిళ్ళూ

ఎరుపెక్కి పోవునా .. ఎన్నెల్లు పండునా

దరిచేరి కూడా దరఖాస్తులేలా !


కాస్తందుకో .. దరఖాస్తందుకో .. ప్రేమ దరఖాస్తందుకో

దగ్గర చేరి.. దస్కతు చేసి .. ప్రేయసి కౌగిలి అందుకో

ఆహహ కాస్తందుకో..దరఖాస్తందుకో..ప్రేమ దరఖాస్తందుకో ! 

Share This :

Related Post



sentiment_satisfied Emoticon

:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
-_-
(o)
[-(
:-?
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
$-)
(y)
(f)
x-)
(k)
(h)
(c)
cheer
(li)
(pl)