కనులు కనులతో కలబడితే పాట లిరిక్స్ | సుమంగళి (1965)

 చిత్రం : సుమంగళి (1965)

సంగీతం : కె.వి. మహదేవన్

సాహిత్యం : ఆచార్య ఆత్రేయ

గానం : ఘంటసాల, సుశీల


కనులు కనులతో కలబడితే

ఆ తగవుకు ఫలమేమి.. కలలే

 

కనులు కనులతో కలబడితే

ఆ తగవుకు ఫలమేమి.. కలలే

నా కలలో నీవే కనబడితే

ఆ చొరవకు బలమేమి.. మరులే

మరులు మనసులో స్ధిరపడితే

ఆపై జరిగేదేమి.. మనువూ.. ఊ ఊ ఊ

మనువై ఇద్దరు ఒకటైతే

ఆ మనుగడ పేరేమి.. సంసారం..

 


 

కనులు కనులతో కలబడితే

ఆ తగవుకు ఫలమేమి.. కలలే..


అల్లరి ఏదో చేసితిని..

చల్లగ ఎదనే దోచితివి

అల్లరి ఏదో చేసితిని..

చల్లగ ఎదనే దోచితివి

ఏమీ లేని పేదననీ..

నాపై మోపకు నేరాన్ని

ఏమీ లేని పేదననీ..

నాపై మోపకు నేరాన్ని

లేదు ప్రేమకు పేదరికం..

నే కోరను నిన్నూ ఇల్లరికం 

లేదు ప్రేమకు పేదరికం..

నే కోరను నిన్నూ ఇల్లరికం 

నింగీ నేలకు కడు దూరం

మన ఇద్దరి కలయిక విడ్డూరం

 

కనులు కనులతో కలబడితే

ఆ తగవుకు ఫలమేమి.. కలలే 

నా కలలో నీవే కనబడితే

ఆ చొరవకు బలమేమి.. మరులే

మరులు మనసులో స్ధిరపడితే

ఆపై జరిగేదేమి.. మనువూ.. ఊ ఊ ఊ

మనువై ఇద్దరు ఒకటైతే

ఆ మనుగడ పేరేమి.. సంసారం..

 

కనులు కనులతో కలబడితే

ఆ తగవుకు ఫలమేమి.. కలలే..ఏ.ఏ..ఏఏ..


Share This :

Related Post



sentiment_satisfied Emoticon

:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
-_-
(o)
[-(
:-?
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
$-)
(y)
(f)
x-)
(k)
(h)
(c)
cheer
(li)
(pl)