పాటల్లో పాడలేనిదీ నోటి మాటల్లో పాట లిరిక్స్ | సిరివెన్నెల (1986)

 చిత్రం : సిరివెన్నెల (1986)

సంగీతం : కె.వి. మహదేవన్

సాహిత్యం : సిరివెన్నెల

గానం : బాలు, ఆనంద్, సుశీల

పాటల్లో పాడలేనిదీ నోటి మాటల్లో చెప్పలేనిదీ

నీ గుండెల్లో నిండి వున్నదీ ఈ బండల్లో పలుకుతున్నదీ

పాటల్లో పాడలేనిదీ నోటి మాటల్లో చెప్పలేనిదీ

నీ గుండెల్లో నిండి వున్నదీ ఈ బండల్లో పలుకుతున్నదీ

నీ ఆర్టు చూసి హార్టు బీటు రూటు మార్చి కొట్టుకుంటు

ఆహా ఓహో అంటున్నదీ.. అది ఆహా ఓహో అంటున్నదీ

ఈ ఇలలోనా శిలపైన కొలువైనా వాణి

ఈ ఇలలోనా శిలపైన కొలువైనా వాణి

వరవీణ మృదుపాణి వనరుహ లోచను రాణి

వరవీణ మృదుపాణి వనరుహ లోచను రాణి

నల్లనయ్యా.. పిల్లనగ్రోవినూదా వెల్లువై యెద పొంగిపోదా

నల్లనయ్యా.. పిల్లనగ్రోవినూదా వెల్లువై యెద పొంగిపోదా

పాట వింటూ లోకమంతా రాతి బొమ్మై నిలిచిపోదా

పాట వింటూ లోకమంతా రాతి బొమ్మై నిలిచిపోదా

నల్లనయ్యా...

అందమైన సుందరాంగులూ యెందరికో నెలవైన రాణివాసము

ఈ కోటలోన దాగి వున్నదీ నాటి ప్రేమగాధలెన్నొ కన్నది

అందమైన సుందరాంగులూ యెందరికో నెలవైన రాణివాసము

ఈ కోటలోన దాగి వున్నదీ నాటి ప్రేమగాధలెన్నొ కన్నది

హిస్టరీల మిస్టులోన మిస్టరీని చాటిచెప్పి

ఆహా ఓహో అంటూన్నదీ

అది ఆహా ఓహో అంటూన్నదీ..

రాసలీలా.. రాగహేల

రాసలీలా.. రాగహేల

రసమయమై సాగు వేళా

తరుణుల తనువులు వెన్నెల తరగలుగా ఊగు వేళా

నురుగుల పరుగులుగా సాగే యమునా నది ఆగు వేళ

నింగినేలా వాగూ వంకా చిత్రంగా చిత్తరువాయే

నింగినేలా వాగూ వంకా చిత్రంగా చిత్తరువాయే

నల్లనయ్యా.. పిల్లనగ్రోవినూదా వెల్లువై యెద పొంగిపోదా

లా లా లా లా లా...

Share This :

Related Post

sentiment_satisfied Emoticon

:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
-_-
(o)
[-(
:-?
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
$-)
(y)
(f)
x-)
(k)
(h)
(c)
cheer
(li)
(pl)