ప్రియురాలి అడ్రస్ ఏమిటో పాట లిరిక్స్ | ఆహా (1998)

 చిత్రం : ఆహా (1998)

సంగీతం : వందేమాతరం  శ్రీనివాస్

రచన :

గానం : వందేమాతరం  శ్రీనివాస్

ప్రియురాలి అడ్రస్ ఏమిటో చెప్పమ్మా కాస్త చెప్పమ్మా

జవరాలీ చిరునామేమిటో చెప్పమ్మా కాస్త చెప్పమ్మా

ఆమె సిగను విరిసే మల్లీ ఆమె నుంచి వీచే గాలీ

ఆమె నిదుర పోయే వేళా జోల పాడు ఓ జాబిల్లీ

ఆమె సిగను విరిసే మల్లీ ఆమె నుంచి వీచే గాలీ

ఆమె నిదుర పోయే వేళా జోల పాడు ఓ జాబిల్లీ

చెప్పమ్మా కాస్త చెప్పమ్మా చెప్పమ్మా కాస్త చెప్పమ్మా

ప్రియురాలి అడ్రస్ ఏమిటో చెప్పమ్మా కాస్త చెప్పమ్మా

జవరాలీ చిరునామేమిటో చెప్పమ్మా కాస్త చెప్పమ్మా 

నిదుర నదిలో ఆమె కోసం నడిరేయి చాటునా మాటు వేసా

కలల వలలో ఆమె రూపం పడగానె వెంటనే లేచి చూశా

ఎదను కొరికే చిలిపి చేపా కులుకు వెనకే కరిగిపోగా

తెల్లారిందే ఇట్టే నేనేమో తెలబోతూ ఉంటే

మళ్ళీ మళ్ళీ ఇంతే ప్రతి రాత్రీ జరిగే తంతే

మసక తెరలు తెరిచేదెవరమ్మా

ప్రియురాలి అడ్రస్ ఏమిటో చెప్పమ్మా కాస్త చెప్పమ్మా

కనులు వెతికే కన్నె ఎవరో వివరాలు తేలనీ మనసు నాదీ

తనను ఎవరో పలకరిస్తే నువు కాదు పొమ్మనీ అంటున్నదీ

జంటలెన్నో కంటబడితే వయసు నన్నూ కసురుతోందే

భూమ్మీదింకా తానూ పుట్టిందో లేదో భామా

ఏమో తెలియదు గానీ మది ప్రేమించేసిందమ్మా

దీని గొడవ ఆపేదెవరమ్మా

ప్రియురాలి అడ్రస్ ఏమిటో చెప్పమ్మా కాస్త చెప్పమ్మా

జవరాలీ చిరునామేమిటో చెప్పమ్మా కాస్త చెప్పమ్మా

Share This :

Related Post

sentiment_satisfied Emoticon

:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
-_-
(o)
[-(
:-?
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
$-)
(y)
(f)
x-)
(k)
(h)
(c)
cheer
(li)
(pl)