కానుకే బొండుమల్లి కైవసం కౌగిలీ పాట లిరిక్స్ | ఉత్తమ విలన్ (2015)

 చిత్రం : ఉత్తమ విలన్ (2015)

సంగీతం : జిబ్రన్

సాహిత్యం : రామజోగయ్య శాస్త్రి

గానం : పద్మలత


కానుకే బొండుమల్లి కైవసం కౌగిలీ

ఆకలీ దాహమే ఆరాధనం ఆరాధనం


ఆఆఅ..కానుకే బొండుమల్లీ కైవసం కౌగిలీ

ఆకలీ దాహమే ఆరాధనం ఆరాధనం


కానుకే బొండుమల్లి కైవసం కౌగిలీ


విల విలా విరహమే అలలయ్యే కడలినై

ప్రణయమే పయనమై పరుగిడే పడవ నై

కలను వెతికి కరిగి మరిగా

మెత్తని మైనపు దేహమై

తలపు వీణను మీటెను తాపం

మాయా మన్మధుని పూల శరమై


కానుకే... ఆఆ.. కైవసం.... ఆఆ..

ఆకలీ దాహమే ఆరాధనం ఆరాధనం


మాటలే వలయునా మనసులే పెనవేయగా

మౌనమే చాలదా మోహమే కలబోయగా

సరస కాలపు సంగీత తాళం

చెంపన చిటెకలు వేయించవా

శృంగార శిఖరపు అంచులు చేరగ

నాతో ఉప్పొంగెడి ఊపిరి కావా


కానుకే బొండుమల్లి కైవసం కౌగిలీ

ఆకలీ దాహమే ఆరాధనం ఆరాధనం


Share This :



sentiment_satisfied Emoticon