చిత్రం : రుద్రమదేవి (2015)
సంగీతం : ఇళయరాజా
రచన : సిరివెన్నెల సీతారామ శాస్త్రి
గానం : హరిహరన్, సాధనా సర్గమ్
అవునా నీవేనా నే వెతుకుతున్న నిధివేనా
ఎదరున్నా ఎదలోనా నిదురించు కాంతివనుకున్నా
అవునా నిన్నేనా వెన్నంటు చెలిమివనుకున్నా
ఐనా ఇక పైనా వెంటాడు కలతవనుకోనా
నిను కలవనా... నను మరువనా
తహ తహల తపనలు తరిమెను తమవలనా
అవునా నీవేనా నే వెతుకుతున్న నిధివేనా
ఐనా ఇక పైనా వెంటాడు కలతవనుకోనా
గూడు వీడిపొయే గువ్వయింది మనసు
మేర మీరిపొయే ఏరయింది వయసు
నిన్ను చూసి చూడగానే నేను ఏమయ్యానో
నువ్వు తాకీ తాకగానే కొత్తజన్మయ్యానో
లేని పోని మాయ ఏమిది
తీయనైన గాయమైనది
హాయి కాని హాయే ఇది ఎదేవైనా
అవునా నీవేనా నే వెతుకుతున్న నిధివేనా
ఐనా ఇక పైనా వెంటాడు కలతవనుకోనా
ఇన్ని నాళ్లు లేదే నేడిదేమి బిడియం
కాలు కదపనీదే వేడుకైన సమయం
తూలరాదే మెలుకాదే పిచ్చి బేలతనమా
ఆప తరమా వెంట తరిమే పిల్లగాలి మహిమ
సింగమంటి పౌరుషం ఇలా
బెంగ పడితే పరువు కాదేల
జింక పిల్ల కళ్ళే ఇలా వేటాడేనా
అవునా నిన్నేనా వెన్నంటు చెలిమివనుకున్నా
ఐనా ఇక పైనా వెంటాడు కలతవనుకోనా
నిను కలవనా... నను మరువనా
తహ తహల తపనలు తరిమెను తమవలనా
అవునా నీవేనా నే వెతుకుతున్న నిధివేనా
ఐనా ఇక పైనా వెంటాడు కలతవనుకోనా
comment 0 comments:
more_vertsentiment_satisfied Emoticon