చిత్రం : బొమ్మా బొరుసా (1971)
సంగీతం : ఆర్. సుదర్శనం
సాహిత్యం : కొసరాజు
గానం : బాలు, పిఠాపురం
బొమ్మా బొరుసా పందెం వెయ్యి నీదో నాదో పై చెయ్యీ
కమాన్.. క్లేప్.. వన్.. టూ
బొమ్మా బొరుసా పందెం వెయ్యి.. నీదో నాదో పైచెయ్యీ

బొమ్మయితేనే నీ గెలుపు... బొరుసయితేనూ నా గెలుపు

బొమ్మయితేనే నీ గెలుపు.. బొరుసయితేనూ నా గెలుపు
డబ్బుంటే గద పైకెగ రేయడం అది లేందెందుకు ఊరక డంబం

సాగిన్నాడూ సర్దాగుండూ ఎదురు తిరిగితే ఏముండూ
నడమంత్రపు సిరీ వచ్చిన్నాడూ నెత్తికి కళ్ళూ వచ్చును చూడూ
బొమ్మా బొరుసా పందెం వెయ్యి.. నీదో నాదో పైచెయ్యీ
బొమ్మయితేనే నీ గెలుపు... బొరుసయితేనూ నా గెలుపు
చంకీ లేందే జడవదు గుర్రం.. గోతిలో పడితే లంగడా గుర్రం

హద్దు మీరితే హడవాగుర్రం.. అదుపులో వుంటే జట్కాగుర్రం
సాధుకు కోపం.. రేగినప్పుడూ.. వధ బట్టందే వదలి పెట్టడూ
బొమ్మా బొరుసా పందెం వెయ్యి.. నీదో నాదో పైచెయ్యీ
బొమ్మయితేనే నీ గెలుపు.. బొరుసయితేనూ నా గెలుపు
పిండుంటే గద రొట్టె చెయ్యడం కొప్పుంటే గద పూలు పెట్టడం
పిండుంటేగద రొట్టె చెయ్యడం కొప్పుంటే గద పూలు పెట్టడం
చమురంటే గద దీపమెలగడం డబ్బుంటే గద డాబుచెల్లడం
ఆడపెత్తనం.. ఎన్నాళ్లు సాగూ.. గుట్టుతెలిస్తే చిటికెలో ఆగు
బొమ్మా బొరుసా పందెం వెయ్యి.. నీదో నాదో పైచెయ్యీ
బొమ్మా బొరుసా పందెం వెయ్యి.. నీదో నాదో పైచెయ్యీ
బొమ్మయితేనే నీ గెలుపు.. బొరుసయితేనూ నా గెలుపు
బొమ్మయితేనే నీ గెలుపు.. బొరుసయితేనూ నా గెలుపు
comment 0 comments:
more_vertsentiment_satisfied Emoticon