ఇదేలే తరతరాల చరితం పాట లిరిక్స్ | పెద్దరికం (1992)

 చిత్రం : పెద్దరికం (1992)

సంగీతం : రాజ్-కోటి

సాహిత్యం : భువనచంద్ర

గానం : ఏసుదాస్, స్వర్ణలత


ఇదేలే తరతరాల చరితం

జ్వలించే జీవితాల కధనం

ఇదేలే తరతరాల చరితం

జ్వలించే జీవితాల కధనం

పగేమో ప్రాణమయ్యేనా 

ప్రేమలే దూరమయ్యేనా

నిరాశే నింగికెగసేనా

ఆశలే రాలిపోయేనా

 

ఇదేలే తరతరాల చరితం

జ్వలించే జీవితాల కధనం


ఒడిలో పెరిగిన చిన్నారినే

ఎరగా చేసినదా ద్వేషమూ

కధ మారదా.. ఈ బలి ఆగదా

మనిషే పశువుగ మారితే

కసిగా శిశువుని కుమ్మితే

మనిషే పశువుగ మారితే

కసిగా శిశువుని కుమ్మితే

అభమూ శుభమూ ఎరుగని

వలపులు ఓడిపోయేనా !


ఇదేలే తరతరాల చరితం

జ్వలించే జీవితాల కధనం

పగేమో ప్రాణమయ్యేనా

ప్రేమలే దూరమయ్యేనా

నిరాశే నింగికెగసేనా

ఆశలే రాలిపోయేనా

ఇదేలే తరతరాల చరితం

జ్వలించే జీవితాల కధనం !


విరిసీ విరియని పూదోటలో

రగిలే మంటలు చల్లారవా

ఆర్పేదెలా .. ఓదార్చేదెలా

నీరే నిప్పుగ మారితే

వెలుగే చీకటి రువ్వితే

నీరే నిప్పుగ మారితే

వెలుగే చీకటి రువ్వితే

పొగలో సెగలో మమతల

పువ్వులు కాలిపోయేనా !


ఇదేలే తరతరాల చరితం

జ్వలించే జీవితాల కధనం

పగేమో ప్రాణమయ్యేనా

ప్రేమలే దూరమయ్యేనా

నిరాశే నింగికెగసేనా

ఆశలే రాలిపోయేనా

ఇదేలే తరతరాల చరితం

జ్వలించే జీవితాల కధనం !

Share This :

Related Post



sentiment_satisfied Emoticon

:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
-_-
(o)
[-(
:-?
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
$-)
(y)
(f)
x-)
(k)
(h)
(c)
cheer
(li)
(pl)