ఏ నావదే తీరమో ఏ నేస్తమే జన్మవరమో పాట లిరిక్స్ | సంకీర్తన (1987)

 చిత్రం : సంకీర్తన (1987)

సంగీతం : ఇళయరాజా

సాహిత్యం : ఆత్రేయ

గానం : ఏసుదాస్


ఏ..ఏ...ఏహే...ఓ....ఓ...ఓ...ఓ....

ఓ...ఓ...ఓ...ఓ...ఓ...


ఏ నావదే తీరమో ఏ నేస్తమే జన్మవరమో

ఏ నావదే తీరమో ఏ నేస్తమే జన్మవరమో

కలగానో..ఓ..ఓ.. కథగానో.. ఓ.. ఓ..

మిగిలేది నీవే.. ఈ జన్మలో.. ఓ..


ఏ నావదే తీరమో.. ఏ నేస్తమే జన్మవరమో


నాలోని నీవే నేనైనానో 

నీలోని నేనే నీవైనావో

నాలోని నీవే నేనైనానో 

నీలోని నేనే నీవైనావో

విన్నావా ఈ వింతను.. అన్నారా ఎవరైనను

విన్నావా ఈ వింతను.. అన్నారా ఎవరైనను

నీకూ నాకే చెల్లిందను.. ఉ.. ఉ..


ఏ నావదే తీరమో.. ఏ నేస్తమే జన్మవరమో


ఆకాశమల్లె నీవున్నావు

నీ నీలి రంగై నేనున్నాను

ఆకాశమల్లె నీవున్నావు 

నీ నీలి రంగై నేనున్నాను

కలిసేది ఊహేనను.. ఊహల్లో కలిసామను..

కలిసేది ఊహేనను.. ఊహల్లో కలిసామను..

నీవూ.. నేనే.. సాక్షాలను..


ఏ నావదే తీరమో.. ఏ నేస్తమే జన్మవరమో

కలగానో..ఓ.. కథగానో.. ఓ..

మిగిలేది నీవే ఈ జన్మలో..

ఏ నావదే తీరమో.. ఏ నేస్తమే జన్మవరమో

ఏ నావదే తీరమో.. ఏ నేస్తమే జన్మవరమో

Share This :



sentiment_satisfied Emoticon