ప్రియుడా పరాకా పాట లిరిక్స్ | అగ్నిపూలు (1981)

 చిత్రం : అగ్నిపూలు (1981)

సంగీతం : చక్రవర్తి

సాహిత్యం : వేటూరి

గానం : సుశీల


ప్రియుడా పరాకా 

ప్రియతమా పరాకా

వన్నె తేలిన కన్నెనాగు 

వలచి వస్తే పరాకా


ప్రియుడా పరాకా 

ప్రియతమా పరాకా

వన్నె తేలిన కన్నెనాగు 

వలచి వస్తే పరాకా


మిసమిసలాడే 

ఈ మేనురా నీదేనురా

రారా చెరగనీకు 

చిలిపి కంటి కాటుకా  


ప్రియుడా పరాకా 

ప్రియతమా పరాకా

వన్నె తేలిన కన్నెనాగు 

వలచి వస్తే పరాకా


ఒంటి నిండా ఒంపులూ 

కంటి నిండా మెరుపులూ

ఓపలేని విరహవేదన 

వేడి బుసలూ

వయసు వగలసెగలు 


ఒంటి నిండా ఒంపులూ 

కంటి నిండా మెరుపులూ

ఓపలేని విరహవేదన 

వేడి బుసలూ 


హా..హా.. తాళజాలరా ..

హా..హా.. జాలమేలరా

జరగరానీ.. 

నా కోరికా.. నా వేడుకా.. 

నీతో తీరకుంటే 

ఏలరా నా పుట్టుకా


ప్రియుడా పరాకా 

ప్రియతమా పరాకా

వన్నె తేలిన కన్నెనాగు 

వలచి వస్తే పరాకా


నన్ను నీవు రమ్మనీ 

నీకు నాపై ప్రేమనీ

రెచ్చగొడితే.. 

సోకులన్నీ చేసుకుంటిని 

నిన్నే చేరుకుంటిని


నన్ను నీవు రమ్మనీ 

నీకు నాపై ప్రేమనీ

రెచ్చగొడితే 

సోకులన్నీ చేసుకుంటిని

హా..హా.. చూడవేమిరా..

హా..హా.. పాడి కాదురా..


చులకనయ్యానా 

ఇంతలో నీ చూపులో

లేరా లేత వలపు 

పూతకొచ్చెను చూడరా


ప్రియుడా పరాకా 

ప్రియతమా పరాకా

వన్నె తేలిన కన్నెనాగు 

వలచి వస్తే పరాకా

వలచి వస్తే పరాకా


అమరమైనది అనురాగమూ

అమరులౌతామూ 

ఈ నాడు మనమూ 

ప్రియా.. ప్రియా.. 

ప్రియతమా..

 

Share This :

Related Post



sentiment_satisfied Emoticon

:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
-_-
(o)
[-(
:-?
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
$-)
(y)
(f)
x-)
(k)
(h)
(c)
cheer
(li)
(pl)