చిత్రం : అగ్గిబరాటా
సంగీతం : విజయా కృష్ణమూర్తి
సాహిత్యం : సినారె
గానం : ఘంటసాల, సుశీల
ఊమ్.మ్... హొయ్ హోయ్ హోయ్ హొయ్..
ఎందుకు కలిగెను ఎందుకు కలిగెను
ఈ వింత... ఏ వింతా .. ?
ఏ నాడు లేని వింత లోలోన చక్కిలిగింత
హొయ్ హోయ్ హోయ్ హొయ్..
ఎందుకు కలిగెను ఎందుకు కలిగెను
ఈ వింత.. ఏ వింతా.. ?
ఏనాడు లేని వింత లోలోన చక్కిలిగింత
హొయ్ హోయ్ హోయ్ హొయ్..
నిన్ను నేను చూసిన నాడే కన్ను చెదరిపోయింది
నిన్ను నేను చూసిన నాడే కన్ను చెదరిపోయింది
కన్ను చెదరిపోయిన నాడే కన్నెమనసు మారింది
నీ లేత వన్నె ఏదో నాలోన మెరిసింది..
నీ లేత వన్నె ఏదో నాలోన మెరిసింది..
హొయ్ హోయ్ హోయ్ హొయ్..
ఎందుకు కలిగెను ఎందుకు కలిగెను
ఈ వింత ఈ వింత
నిగ్గులొలుకు బుగ్గలు చూసీ నిలిచిపోతి ఆనాడు
నిగ్గులొలుకు బుగ్గలు చూసీ నిలిచిపోతి ఆనాడు
చేతినిండ సిగ్గులు దూసీ చేరుకుంటి ఈ నాడూ
అందాల తీరమేదో అందుకుంటి నీతోడూ
అందాల తీరమేదో అందుకుంటి నీతోడూ
హొయ్ హోయ్ హోయ్ హొయ్..
ఎందుకు కలిగెను ఎందుకు కలిగెను
ఈ వింత ఈ వింత
ఏనాడు లేని వింత లోలోన చక్కిలిగింత
ఏనాడు లేని వింత లోలోన చక్కిలిగింత
comment 0 comments:
more_vertsentiment_satisfied Emoticon