మెల్లగా ఊయలే ఊపే గోదారి పాట లిరిక్స్ | రుక్మిణి (1997)


చిత్రం : రుక్మిణి (1997)

సంగీతం : విద్యాసాగర్ 

సాహిత్యం : సిరివెన్నెల

గానం : బాలు 


మెల్లగా ఊయలే ఊపే గోదారి

చల్లగా జోలలే పాడే ఈ గాలి

అమ్మఒళ్లో విడిచిన పసితనాన్ని 

ఊహకైనా మిగలని జ్ఞాపకాన్ని 

ఇవాళ నాకు గురుతు చేయగా 


మెల్లగా ఊయలే ఊపే గోదారి

చల్లగా జోలలే పాడే ఈ గాలి


క్షేమమా నాయనా అన్నవి ఈ చేలు 

నేస్తమా చేరుకో అన్నవి ఈ పూలు

సొంతమేమో నాకీ పరిసరాలు

పాతవేమో పిలిచే పరిచయాలు

ఏనాటి జన్మబంధమో ఇదీ 


క్షేమమా నాయనా అన్నవి ఈ చేలు 

నేస్తమా చేరుకో అన్నవి ఈ పూలు

Share This :



sentiment_satisfied Emoticon