చిత్రం : యువ (2004)
సంగీతం : ఎ.ఆర్.రహ్మాన్
సాహిత్యం : వేటూరి
గానం : ఎ.ఆర్.రహ్మాన్, కార్తీక్
ఓ యువ యువ
ఓ యువ యువ ఓఓఓ
జన గణ మన జన మొర విన
కల నిజమయ్యే కాలం ఇదే
వెలుగే బాటగా మలలే మెట్లుగా
పగలే పొడిగాగ
చక్ చక్ చక్ చక్ చక్ పట్ చల్
జన గణ మన జన మొర విన
కల నిజమయ్యే కాలం ఇదే
ఇకపై ఇకపై విరచిద్దాం
ఓ యువ యువ ఓ యువ
విధినే మార్చే ఒక చట్టం
ఓ యువ యువ ఓ యువ
జన గణ మన జన మొర విన
కల నిజమయ్యే కాలం ఇదే
వెలుగంటే బాటేగా
మలలన్నీ మెట్లేగా
పగలే పొడిగాగా
ఆయుధమిదే అహమిక వధే
దివిటీ ఇదే చెడుగుకు చితే
ఇరులే తొలగించు
ఈ నిరుపేదల ఆకలి కేకలు
ముగించు బరితెగించు
అరె స్వాహాల దాహాల
ద్రోహాల వ్యూహాలు ఛేధించు
కారడవుల సుడిగాలి మనం
కాలికి తొడుగులు ఎందుకులే
తిరగబడే యువ శక్తి మనం
ఆయుధమెందుకు విసిరేసెయ్
ఓ యువ ఓ యువ
ఓ యువ ఓ యువ
జన గణ మన జన మొర విన
కల నిజమయ్యే కాలం ఇదే
అదురే విడు గురితో నడు
భేదం విడు గెలువిప్పుడు లేరా పోరాడు
మలుపుల చొరబడి నది వలె పరుగిడి
శ్రమించు శ్రమ ఫలించు
అరె విజయాల వీధుల్లో
నీ వీర సైన్యాలు నిలిస్తే
సజ్జనులంతా వొదిగుంటే
నక్కలు రాజ్యాలేల్తుంటే
ఎదురే తిరుగును యువ జనతా
ఎదురే తిరుగును భూమాతా
ఓ యువ ఓ యువ
ఓ యువ ఓ యువ
జన గణ మన జన మొర విన
కల నిజమయ్యే కాలం ఇదే
వెలుగే బాటగా
మలలే మెట్లుగా
పగలే పొడికాగ
చక్ చక్ చక్ చక్ ఫట్ చల్
జన గణ మన జన మొర విన
కల నిజమయ్యే కాలం ఇదే
ఇకపై ఇకపై విరచిద్దాం
ఓ యువ యువ ఓ యువ
విధినే మార్చే ఒక చట్టం
ఓ యువ యువ ఓ యువ
ఇకపై ఇకపై విరచిద్దాం
ఓ యువ యువ ఓ యువ
విధినే మార్చే ఒక చట్టం
ఓ యువ యువ ఓ యువ
comment 0 comments:
more_vertsentiment_satisfied Emoticon