వసంతాల ఈ గాలిలో పాట లిరిక్స్ | ఇది మా అశోగ్గాడి లవ్ స్టోరీ (2002)

 చిత్రం : ఇది మా అశోగ్గాడి లవ్ స్టోరీ (2002)

సంగీతం : ఆనంద్ మిలింద్

సాహిత్యం : వేటూరి

గానం : అభిజిత్


వసంతాల ఈ గాలిలో గులాబి గుబాళింపులు

సరాగాల ఈ సంజెలో పరాగాల కవ్వింపులు

ఇవేనాటి క్రీనీడలో తుషారాలనీరెండలు

కుహూమన్న ఈ గొంతులో ధ్వనించాయిలే ప్రేమలు

వసంతాల ఈ గాలిలో గులాబి గుబాళింపులు

సరాగాల ఈ సంజెలో పరాగాల కవ్వింపులూ


మేఘాల సందేశమూ ఆ ప్రేమ విరిజల్లులే

స్వప్నాల సంకేతమూ ఎదలోని హరివిల్లులే

మైనాల సంగీతమూ ఈ పూల గంధాలులే

ప్రతిరోజు సాయంత్రమూ నీ వేడి నిట్టూర్పులే

అది శోకమో ఒక శ్లోకమో ఈ లోకమే ప్రేమలే


వసంతాల ఈ గాలిలో గులాబి గుబాళింపులు

సరాగాల ఈ సంజెలో పరాగాల కవ్వింపులూ


ప్రేమించినా కళ్ళకూ నిదురన్నదే రాదులే

ప్రేమించినా వాళ్ళకూ ఏ ఆకలి లేదులే

ఊహల్లో విహరింపులూ ఉయ్యాల పవళింపులూ

వెన్నెల్ల వేధింపులూ వెచ్చంగ లాలింపులూ

అది యోగమో అనురాగమో పురివిప్పు ఈ ప్రేమలో


వసంతాల ఈ గాలిలో గులాబి గుబాళింపులు

సరాగాల ఈ సంజెలో పరాగాల కవ్వింపులు

ఇవేనాటి క్రీనీడలో తుషారాల నీరెండలు

కుహూమన్న ఈ గొంతులో ధ్వనించాయిలే ప్రేమలు


 

Share This :

Related Post



sentiment_satisfied Emoticon

:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
-_-
(o)
[-(
:-?
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
$-)
(y)
(f)
x-)
(k)
(h)
(c)
cheer
(li)
(pl)