ఓ బుచ్చిబాబు పాట లిరిక్స్ | నాటకాలరాయుడు (1969)

 చిత్రం : నాటకాలరాయుడు (1969) 

సంగీతం : జి.కె.వెంకటేష్ 

సాహిత్యం : ఆత్రేయ 

గానం : బాలు


ఇదే జీవితమురా ఇదే దాని కతరా 

తంటాల బ్రహ్మయ్యా తకరార్లు ఇవిరా 


ఓ... బుచ్చిబాబు... 

ఓ బుచ్చిబాబు అరె ఓ పిచ్చి బాబు 

తలరాత ఒకే తికమక మకతిక 

ముఖ ముఖానికి రకరకాలుగా 

తికమక మకతిక తికమక 


ఓ బుచ్చిబాబు అరె ఓ పిచ్చి బాబు

తలరాత ఒకే తికమక మకతిక 

ముఖ ముఖానికి రకరకాలుగా 

తికమక మకతిక తికమక 

ఓ బుచ్చిబాబు..


బడా యాక్టరు అవుతానంటూ 

బడాయి కొట్టి వచ్చావు 

భలే భలేరా.. భలే భలేరా 

కొళాయి దగ్గర అంట్లే తోమేవు

చివరకు అంట్లే తోమేవు 

ఓ అబ్బాయి ఏ పనికైనా ఫిట్టూ 

నువ్వు ఫిట్టూ ఇది కరకట్టు 

ఇవి తోమి పెట్టు 

తోము తోము తోము తకథోం..


ఓ బుచ్చిబాబు అరె ఓ పిచ్చి బాబు

తలరాత ఒకే తికమక మకతిక 

ముఖ ముఖానికి రకరకాలుగా 

తికమక మకతిక తికమక 

ఓ బుచ్చిబాబు


ప్రపంచమే ఒక నాటకరంగం 

కదిలిస్తే చదరంగం 

నవాబు వేషం వేసేవాడు 

జవాను పని చేస్తాడు 

చివరకు గరీబుగా ఛస్తాడు 

ఓ అబ్బాయి కళాజీవితం 

లక్కు ఒక ట్రిక్కు 

ఒకరికి లక్కు ఒకరికి ట్రిక్కు 

లక్కు ట్రిక్కు లక్కూ 


ఓ బుచ్చిబాబు అరె ఓ పిచ్చి బాబు

తలరాత ఒకే తికమక మకతిక 

ముఖ ముఖానికి రకరకాలుగా 

తికమక మకతిక తికమక 

ఓ బుచ్చిబాబు


ఒకడి ఆకలికి అంబలి నీళ్ళు 

ఒకడికి పాలు పళ్లు 

భలే భలేరా.. భలే భలేరా 

దగాల దేవుడ బాగా పంచావు 

కోతికి బాబనిపించావు

ఓ బ్రహ్మయ్యో నీ లీలలే 

గడబిడ యడ పెడ 

నీ గడాబిడా మాకెడాపెడా 

గడబిడ ఎడపెడ గడబిడ 


ఓ బుచ్చిబాబు అరె ఓ పిచ్చి బాబు

తలరాత ఒకే తికమక మకతిక 

ముఖ ముఖానికి రకరకాలుగా 

తికమక మకతిక తికమక 

ఓ బుచ్చిబాబు....


Share This :

Related Post



sentiment_satisfied Emoticon

:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
-_-
(o)
[-(
:-?
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
$-)
(y)
(f)
x-)
(k)
(h)
(c)
cheer
(li)
(pl)