చిత్రం : మిస్సమ్మ (1955)
సంగీతం : ఎస్.రాజేశ్వరరావు
సాహిత్యం : పింగళి
గానం : పి.లీల
తెలుసుకొనవే చెల్లి.. అలా నడుచుకొనవే చెల్లీ
తెలుసుకొనవే చెల్లి
మగవారికి దూరముగ మగువలెపుడు మెలగాలని
మగవారికి దూరముగ మగువలెపుడు మెలగాలని
తెలుసుకొనవే చెల్లి.. అలా నడుచుకొనవే చెల్లీ
తెలుసుకొనవే చెల్లి
మనకు మనమె వారికడకు పని ఉన్నా పోరాదని
ఆఆ.ఆఆఆఆఆఆఆఆఆ..
మనకు మనమె వారికడకు పని ఉన్నా పోరాదని
అలుసు చేసి నలుగురిలో చులకనగ చూసెదరని
అలుసు చేసి నలుగురిలో చులకనగ చూసెదరని
తెలుసుకొనవే చెల్లి... అలా నడుచుకొనవే చెల్లీ
తెలుసుకొనవే చెల్లి
పదిమాటలకొక మాటయు బదులు చెప్పకూడదని
ఆఆఆఆఆఆఆఆఆ...ఆ..ఆ..
పదిమాటలకొక మాటయు బదులు చెప్పకూడదని
లేని పోని అర్థాలను మన వెనుకనె చాటెదరని
లేని పోని అర్థాలను మన వెనుకనె చాటెదరని
తెలుసుకొనవే చెల్లి... అలా నడుచుకొనవే చెల్లీ
తెలుసుకొనవే చెల్లి...
comment 0 comments:
more_vertsentiment_satisfied Emoticon