నీవలనే నీవల్లనే పాట లిరిక్స్ | యుద్ధం శరణం గచ్ఛామి (2017)


చిత్రం : యుద్ధం శరణం గచ్ఛామి (2017)

సంగీతం : వివేక్ సాగర్

సాహిత్యం : శ్రేష్ట

గానం : కార్తీక్


ఆఁ....  పాలనకున్నా చూసే కన్నులని

రెప్పే పడదే ఎలాగా

దాచాలనుకున్నా నాలో ఆశల్ని

మనసే వినదే ఎలాగా

కుదురుగా లేనే లేనే నీవలనే

ఏం చేశావేమో ఏమో నీవే

గిలిగింతలు ఎన్నెన్నో ఎదలో కలిగే

ఏం చేశావేమో ఏమో నీవే నీవే

నాలో నన్నే మాయం చేసి

ఎదో మాయే నీవై


నీవలనే నీవల్లనే ఇంతలా సందళ్ళే

నీవలనే నీవల్లనే ఓ ఓ

నీవలనే నీవల్లనే గుండెల్లో సవ్వళ్ళే


కురిపించే ఈ అనురాగమంతా

కలకాలం నిలవాలన్నా

కలలే నిజమై పోనీ

నిజమే నిత్యం కానీ

పెనవేసే ఆనందాలింకెంతో పెరగాలిలా


పద పద పద పద మది ఇలా

పదే పదే పదే నీ వైపుకే ఇలా


నేననే మాటే నేనే మరిచేలా

ఓ...ఓ... ఏం చేశావేమో

ఏమో నీవే ఎదగిల్లి నన్నే దోచి

ఏం చేశావో ఏమో నీవే నీవే

కవ్వించే కరిగించే వలపన్ని

నీలోనే బంధించి వేశావే

దాచాలనుకున్నా నాలో ఆశల్ని

మనసే వినదే ఎలాగా


ఏనాడు తెలియని ఎదో గమకమే

ఇపుడే ఇపుడే నను తాకే

ఈ మైమరుపులే పెట్టే మెలికలే

రేపే తీపి ఆశల్నే


నీవలనే నీవల్లనే ఇంతలా సందళ్ళే

నీవలనే నీవల్లనే ఓ ఓ

నీవలనే నీవల్లనే గుండెల్లో సవ్వళ్ళే


నీవలనే నీవల్లనే

నీవలనే నీవల్లనే ఓ ఓ

Share This :



sentiment_satisfied Emoticon