సంబరాలో సంబరాలు పాట లిరిక్స్ | సంఘర్షణ (1983)


చిత్రం : సంఘర్షణ (1983)

సంగీతం : చక్రవర్తి 

సాహిత్యం : వేటూరి 

గానం : బాలు, సుశీల,


సంబరాలో సంబరాలు 

దీపాళి పండగా సంబరాలు 

సంబరాలో సంబరాలు 

దీపాళి పండగా సంబరాలు 

పేదోళ్ళ పాకల్లో సంబరాలు 

గొప్పోళ్ల గుండెల్లో గింగిరాలు

సంబరాలో సంబరాలు 

దీపాళి పండగా సంబరాలు 


పేదోడూ గొప్పోడూ తేడా లేదీనాడు 

పేదోడూ గొప్పోడూ తేడా లేదీనాడు

వాడైనా వీడైనా జాతికి మానవుడు 

నీతికి వారసుడే ఒకడికి ఒకడూ సోదరుడే 

అరెరెరె గుమ్కుగుమా గుమాలకిడి సంబరాలో

అరె జమ్కుజమా జమాలకిడి సంబరాలో


గుమ్కుగుమా గుమాలకిడి సంబరాలో

జమ్కుజమా జమాలకిడి సంబరాలో


కలిసికట్టుగున్నాము 

గుమ్కు గుమా గుమాలకిడి 

గెలుపు తెచ్చుకున్నాము 

జమ్కు జమా జమాలకిడి 

కలిసికట్టుగున్నాము 

గెలుపు తెచ్చుకున్నాము 

కాపాడుకుందాము రేపటికి 

ఈ దీపాలు ఇలాగే వెలగడానికి

చదువు సంధ్యలేదు మన పిల్లోళ్ళకి 

సక్కంగా పంపుదాము బళ్ళోనికి 

కొల్లబోయు గుల్లైనా జీవితాలకీ

కొత్త ప్రాణం పోసుకుందాం రోజు రోజుకీ


సంబరాలో సంబరాలు 

దీపాళి పండగా సంబరాలు 


మనసు పెంచుకుందాము  

గుమ్కు గుమా గుమాలకిడి

మమత పంచుకుందాము 

జమ్కు జమా జమాలకిడి

మనసు పెంచుకుందాము 

మమత పంచుకుందాము 

మనుషులల్లె ఉందాము ఎప్పటికీ 

మన మంచి సెడు తెలుసుకుని పెరగడానికి 

చిచ్చుబుడ్డి పెట్టేద్దాం మత్సరానికి 

కాకరొత్తి చాలు చేయి కలపడానికి

రేపు మాపు రాబోయే వెన్నెలకీ 

పాడుకుందాం స్వాగతాలు ఈ రాత్రికి 


సంబరాలో సంబరాలు 

దీపాళి పండగా సంబరాలు 

సంబరాలో సంబరాలు 

దీపాళి పండగా సంబరాలు 


Share This :

Related Post



sentiment_satisfied Emoticon

:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
-_-
(o)
[-(
:-?
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
$-)
(y)
(f)
x-)
(k)
(h)
(c)
cheer
(li)
(pl)