నా కథలో యువరాణి వేరెవరొ కాదు నేనే పాట లిరిక్స్ | కథలో రాజకుమారి (2017)


చిత్రం : కథలో రాజకుమారి (2017)

సంగీతాం : ఇళయరాజా

సాహిత్యం : కృష్ణకాంత్

గానం : విభావరి


నా కథలో యువరాణి వేరెవరొ కాదు నేనే

నా ఎదనే మలచుకున్నా రాణివాసంగానే

ఈ నేలే ఉయ్యాలై పాడుతుంది సరిగమలే

మేఘంలా నే తేలి తిరుగుతున్నా లోకాలే

మనసే రాసే చందమామ కథనే


నా కథలో యువరాణి వేరెవరొ కాదు నేనే

నా ఎదనే మలచుకున్నా రాణివాసంగానే


చూసుకుంటాను నన్నే నేనే

పూసే పువ్వుల్లో విరబూసే నవ్వుల్లో

పాడుకుంటాను ఆటే ఆడే

ఊగే కొమ్మల్లో ఆ కోయిల గొంతుల్లో

కనిపించే సంతోషం నను చేరకుంటె రాదే

చిగురించే ఆనందం నేను పెంచుకున్న నాదే

ఆగమంటే రాను వెంటే చిన్నబోతోంది నీ అందం


నా కథలో యువరాణి వేరెవరొ కాదు నేనే

నా ఎదనే మలచుకున్నా రాణివాసంగానే


దాచుకున్నాను కళ్ళలోనే ఏవో ఆ కథలు

ఎపుడొస్తాయో కలలు

గూడు కట్టేసి గుండెల్లోనే ఉండే స్నేహాలూ

ఎదురవుతాయా అసలు

కనిపించే ఆకాశం సిరివెన్నెలమ్మ నేస్తం

కురిసిందా చిరుజల్లే ఈ నేల తల్లి సొంతం

ఎక్కడుందో ఎక్కడుందో నన్ను చేరేటి ఆనందం 


నా కథలో యువరాణి వేరెవరొ కాదు నేనే

నా ఎదనే మలచుకున్నా రాణివాసంగానే

ఈ నేలే ఉయ్యాలై పాడుతోంది సరిగమలే

మేఘంలా నే తేలి తిరుగుతున్నా లోకాలే

మనసే రాసే చందమామ కథలే


నా కథలో యువరాణి వేరెవరొ కాదు నేనే

నా ఎదనే మలచుకున్నా రాణివాసంగానే

 

Share This :

Related Post



sentiment_satisfied Emoticon

:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
-_-
(o)
[-(
:-?
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
$-)
(y)
(f)
x-)
(k)
(h)
(c)
cheer
(li)
(pl)