చెలియా నిను చూడకుండా ఉండలేనమ్మా సాంగ్ లిరిక్స్ సంపంగి (2001) తెలుగు సినిమాAlbum :Sampangi


Starring:Deepak, Kanchi kaul ,
Music :Ghantadi Krishna
Lyrics-N/A
Singers :Udit Narayan, Anuradha sriram
Producer:Smt Kalyanivenkatesh
Director:Sana yaadi Reddy
Year:2001

English Script Lyrics Click Here
చెలియా నిను చూడకుండా ఉండలేనమ్మా సాంగ్ లిరిక్స్
చెలియా  నిను చూడకుండా ఉండలేనమ్మా
నిను చూస్తే రోజు నాకు పండగేనమ్మా
చెలియ నిను చూడకుండా ఉండలేనమ్మా
నిను చూస్తే రోజు నాకు పండగేనమ్మా
నా అడుగులలో అడుగేస్తు నా మది లోయల్లో చూస్తు
నా అడుగులలో అడుగేస్తు నా మది లోయల్లో చూస్తు
నా గుండెల్లో చొరపడిపోయావే
చెలియ నిను చూడకుండా ఉండలేనమ్మా

నెచ్చెలి పైటకు వెచ్చగా తాకే చిరుగాలిని
నా చెలి నుదుటికి అందానిచ్చే సింధూరమై
కమ్మని కలగా రమ్మని పిలిచే నా నేస్తమై
అక్కున చేర్చుకు ఆరాధించే నా ప్రాణమై
గున్నమావి తోటల్లోన నే ఎదురు చూస్తాలే
గుప్పెడంత గుండెల్లోన చోటిస్తా రావయ్యో
నా ప్రేమ రాశివి నువ్వే హ.....
నా ఊపిరి  చిరునామా నువ్వే 
చెలియ నిను చూడకుండా ఉండలేనమ్మా

 మనసా వాచే నీ మదిలోన కొలువుండనా
నా నిలువెల్లా దాసోహలే చేసేయనా
ఎల్లలు లేని ప్రేమకు ద్వారం తెరిచేయనా
ఏడడుగులతో కొంగుముడేస్తా ఏదేమైనా
నీ వెంటే నడిచొస్తాను ఆ నింగి దాటైనా 
నువ్వంటే పడి చస్తాను రేయైనా పగలైనా
నా రెండు కన్నులు నువ్వే హ....
నా చంటి పాపవు నువ్వే...

చెలియ నిను చూడకుండా ఉండలేనమ్మా
నిను చూస్తే రోజు నాకు పండగేనమ్మా
నా అడుగులలో అడుగేస్తు నా మది లోయల్లో చూస్తు
నా అడుగులలో అడుగేస్తు నా మది లోయల్లో చూస్తు
నా గుండెల్లో చొరపడిపోయావే 
చెలియ నిను చూడకుండా ఉండలేనమ్మా
Share This :sentiment_satisfied Emoticon