వేడుకొందామా అన్నమాచార్యుల కీర్తనలు లిరిక్స్ | భక్తీ | Aarde Lyrics
Album :: Annamacharya Keerthanalu


Song/ Keerthana :: వేడుకొందామా 

Get This Keerthana In English Script Click Here

Aarde Lyrics


వేడుకొందామా వేంకటగిరి వేంకటేశ్వరుని ‖

ఆమటి మ్రొక్కుల వాడె ఆదిదేవుడే వాడు |
తోమని పళ్యాలవాడె దురిత దూరుడే ‖

వడ్డికాసుల వాడె వనజనాభుడే పుట్టు |
గొడ్డురాండ్రకు బిడ్డలిచ్చే గోవిందుడే ‖

ఎలిమి గోరిన వరాలిచ్చే దేవుడే వాడు |
అలమేల్మంగా శ్రీవేంకటాద్రి నాథుడే ‖
Share This :sentiment_satisfied Emoticon