తెప్పగా మర్రాకు మీద అన్నమాచార్యుల కీర్తనలు లిరిక్స్ | భక్తీ | Aarde Lyrics




Album :: Annamacharya Keerthanalu


Song/ Keerthana :: తెప్పగా మర్రాకు మీద


Get This Keerthana In English Script Click Here



Aarde Lyrics



తెప్పగా మర్రాకు మీద తేలాడువాడు |
ఎప్పుడు లోకములెల్ల నేలేటివాడు ‖


మోతనీటి మడుగులో యీతగరచినవాడు |
పాతగిలే నూతిక్రింద బాయనివాడు |
మూతిదోసిపట్టి మంటిముద్ద పెల్లగించువాడు |
రోతయైన పేగుల పేరులు గలవాడు ‖

కోడికూత నోరివాని కుర్రతమ్ముడైనవాడు |
బూడిద బూసినవాని బుద్ధులవాడు |
మాడవన్నె లేడివెంట మాయలబడినవాడు |
దూడల నావులగాచి దొరయైనవాడు ‖

ఆకసానబారే వూరి అతివల మానముల |
కాకుసేయువాడు తురగముపైవాడు |
ఏకమై వేంకటగిరి నిందిరారమణి గూడి |
యేకాలముబాయని యెనలేనివాడు ‖
Share This :



sentiment_satisfied Emoticon