Album :: Annamacharya Keerthanalu
Song/ Keerthana :: కోడెకాడె వీడె
Get This Keerthana In English Script Click Here
Aarde Lyrics
కోడెకాడె వీడె వీడె గోవిందుడు
గొల్లెతల వలపించె గోవిందుడు
కొల్లలాడె వెన్నలు గోవిందుడు |
గుల్ల సంకు~ంజక్రముల గోవిందుడు
గొల్లవారింట పెరిగె గోవిందుడు ‖
కోలచే పసులగాచె గోవిందుడు
కూలగుమ్మె కంసుని గోవిందుడు |
గోలయై వేల కొండెత్తె గోవిందుడు
గూళెపుసతుల~ం దెచ్చె గోవిందుడు ‖
కుందనపు చేలతోడి గోవిందుడు
గొందులు సందులు దూరె గోవిందుడు |
కుందని శ్రీవేంకటాద్రి గోవిందుడు
గొంది~ం దోసె నసురల గోవిందుడు ‖
comment 0 comments:
more_vertsentiment_satisfied Emoticon