కొలిచిన వారల అన్నమాచార్యుల కీర్తనలు లిరిక్స్ | భక్తీ | Aarde Lyrics




Album :: Annamacharya Keerthanalu


Song/ Keerthana :: కొలిచిన వారల

Get This Keerthana In English Script Click Here

Aarde Lyrics







కొలిచిన వారల కొంగుపైడితడు |
బలిమి తారక బ్రహ్మమీతడు ‖

ఇనవంశాంబుధి నెగసిన తేజము |
ఘనయజ్ఞంబుల గల ఫలము |
మనుజరూపమున మనియెడి బ్రహ్మము |
నినువుల రఘుకుల నిధానమీతడు ‖

పరమాన్నములోపలి సారపుజవి |
పరగినదివిజుల భయహరము |
మరిగినసీతా మంగళసూత్రము |
ధరలో రామావతారంబితడు ‖

చకితదానవుల సంహారచక్రము |
సకల వనచరుల జయకరము |
వికసితమగు శ్రీవేంకట నిలయము |
ప్రకటిత దశరథ భాగ్యంబితడు ‖

Share This :

Related Post



sentiment_satisfied Emoticon

:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
-_-
(o)
[-(
:-?
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
$-)
(y)
(f)
x-)
(k)
(h)
(c)
cheer
(li)
(pl)