ఇతరులకు నిను అన్నమాచార్యుల కీర్తనలు లిరిక్స్ | భక్తీ | Aarde Lyrics




Album :: Annamacharya Keerthanalu


Song/ Keerthana :: ఇతరులకు నిను


Get This Keerthana In English Script Click Here


Aarde Lyrics





ఇతరులకు నిను నెరుగదరమా ‖
సతతసత్యవ్రతులు సంపూర్ణమోహవిర-
హితులెరుగుదురు నిను నిందిరారమణా ‖


నారీకటాక్షపటునారాచభయరహిత-
శూరులెరుగుదురు నిను జూచేటిచూపు |
ఘొరసంసార సంకులపరిచ్ఛేదులగు-
ధీరులెరుగుదురు నీదివ్యవిగ్రహము ‖

రాగభోగవిదూర రంజితాత్ములు మహా-
భాగులెరుగుదురు నిను బ్రణుతించువిధము |
ఆగమోక్తప్రకారాభిగమ్యులు మహా-
యోగులెరుగుదురు నీవుండేటివునికి ‖

పరమభాగవత పదపద్మసేవానిజా-
భరణు లెరుగుదురు నీపలికేటిపలుకు |
పరగునిత్యానంద పరిపూర్ణమానస-

స్థిరు లెరుగుదురు నిను దిరువేంకటేశ ‖















Share This :

Related Post



sentiment_satisfied Emoticon

:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
-_-
(o)
[-(
:-?
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
$-)
(y)
(f)
x-)
(k)
(h)
(c)
cheer
(li)
(pl)