Starring: Allu Arjun, Anu Emmanuel
Music :Vishal–Shekhar
Singers :Vishal Dadlani
Producer:Sirisha Sridhar Lagadapati, Bunny Vas
Director:Vakkantham Vamsi
Year: 2018
Englsih Script Lyrics Click Here
ఓ సైనికా (సరిహద్దున నువ్వు లేకుంటే) సాంగ్ లిరిక్స్
సరిహద్దున నువ్వు లేకుంటే
ఏ కనుపాప కంటి నిండుగ
నిలువెత్తు నిప్పు కంచెవై
నువ్వుంటేనే జాతి బావుట
ఎగురుతుందిరా పైకెగుతుందిరా
ఇల్లే ఇండియా దిల్లే ఇండియా
నీ తల్లే ఇండియా
తన భరోసా నువ్వే దేశం కొడకా
సెలవే లేని సేవక ఓ సైనికా
పనిలో పరుగే తీరిక ఓ సైనికా
ప్రాణం అంతా తేలిక ఓ సైనికా
పోరాటం నీకో వేడుక ఓ సైనికా
దేహంతో వెళ్లిపోదీ కథ
దేశంలా మిగిలిపోతుందిగా
సమరం ఒడిలో నీ మరణం
సమయం తేల్చే స్మరణం
చరితగా చదివే తరములకు
నువ్వో స్ఫూర్తి సంతకం
పస్తులు లెక్కపెట్టవే ఓ సైనికా
పుస్తెలు లక్ష్యపెట్టవే ఓ సైనికా
గస్తీ దుష్టుల సాక్షిగా ఓ సైనికా
ప్రతి పూట నీకో పుట్టుకే ఓ సైనికా
బతుకిది గడవదు అని నువ్విటు రాలేదు
ఏ పని తెలియదని నీ అడుగిటు పడలేదు
తెగవగు ధీరుడివనీ బలమగు బతుకీడనీ
నీ శక్తిని నమ్మి
ఇల్లే ఇండియా దిల్లే ఇండియా
ఇల్లే ఇండియా దిల్లే ఇండియా
నీ తల్లే ఇండియా
తన భరోసా నువ్వే దేశం కొడకా
నువ్వో మండే భాస్వరం ఓ సైనికా
జ్వాల గీతం నీ స్వరం ఓ సైనికా
బతుకే వందేమాతరం ఓ సైనికా
నీ వల్లే ఉన్నాం అందరం ఓ సైనికా
comment 2 comments:
more_vertకల్నల్ సంతోష్ బాబుకు 🙏
కల్నల్ సంతోష్ బాబుతో పాటు అమరులైన సైనికులకు 🙏.
sentiment_satisfied Emoticon