మా పెరటి జాంచెట్టు సాంగ్ లిరిక్స్ పెళ్ళిసందడి (1996) తెలుగు సినిమా | Aarde LyricsAlbum :Pelli Sandadi


Starring:Srikanth, Ravali, Deepthi Bhatnagar
Music :M.M.Keeravani
Lyrics-Veturi
Singers :S P Balu, Chitra
Producer:Allu Aravind, Aswani Dutt
Director:K.Raghavendra Rao
Year: 1996


English Script Lyrics Click Here

మా పెరటి జాంచెట్టు  సాంగ్ లిరిక్స్


కాబోయే శ్రీవారికీ... ప్రేమతో.
రాసి పంపుతున్న 
ప్రియ రాగాల ఈ లేఖ.

మా పెరటి జాంచెట్టు 
పళ్ళన్నీ కుశలం అడిగే
మా తోట చిలకమ్మ 
నీ కొసం ఎదురే చూసే
నిన్ను చూసినాక నిదరైన రాక 
మనసే పెళ్ళి మంత్రాలు కోరిందని
బిగి కౌగిట హాయిగ కరిగేది 
ఏ నాడని... అంటూ.

మా పెరటి జాంచెట్టు 
పళ్ళన్నీ కుశలం అడిగే

Yes you are my dream girl 
నా కలల రాణి నా కళ్ళ ముందుంది
అద్భుతం హహ అవును అద్భుతం. 
మన కలయిక అద్భుతం.
ఈ కలయిక ఇలాగే వుండాలి ... 
promise... promise...

నిన్ను చూడందే పదే పదే పడే యాతన
తోట పూలన్ని కనీ వినీ పడేను వేదనా
నువ్వు రాకుంటే మహాశయా మదే ఆగునా
పూల తీగల్తో పడే ఉరే నాకింక దీవెనా

చూసే కన్నుల ఆరాటం 
రాసే చేతికి మోమాటం
తలచి వలచి పిలచి అలసి 
నీ రాక కొసం వేచి వున్న 
ఈ మనసుని అలుసుగ 
చూడకనీ... అంటూ...

మా పెరటి జాంచెట్టు 
పళ్ళన్నీ కుశలం అడిగే
మా తోట చిలకమ్మ 
నీ కొసం ఎదురే చూసే

పెళ్ళి చూపుల్లొ నిలేసినా కధేవిటొ మరీ
ఙ్నాపకాలల్లొ చలేసిన జవాబు నువ్వనీ
సందె పొద్దుల్లా ప్రతీ క్షణం యుగాలై ఇలా
నీటి కన్నుల్లా నిరీక్షణం నిరాశ కాదనీ
తప్పులు రాస్తే మన్నించు 
తప్పక దర్శన మిప్పించు
యెదటో నుదుటో ఎచటో మజిలీ. 
నీ మీద ప్రాణం నిలుపుకున్న 
మా మనవిని విని 
దయచేయమనీ... అంటూ...

మా పెరటి జాంచెట్టు 
పళ్ళన్నీ కుశలం అడిగే
మా తోట చిలకమ్మ 
నీ కొసం ఎదురే చూసే

సపమ నిప గాగా మా రీ సాస 
నిస రిస రిపగా
సపమ నిప గాగా మా రీ సాస 
నిస రిస రిమగా 
Share This :sentiment_satisfied Emoticon