కళ్లల్లో కలవరమై సాంగ్ లిరిక్స్ దొరసాని (2019) తెలుగు సినిమా | Aarde Lyrics

Album : Dorasaani


Starring:Anand Deverakonda, Shivathmika Rajashekar
Music :Prashanth R Vihari
Lyrics-Shrestha
Singers :Chinmayi Sripada
Producer:Madhura Sreedhar Reddy & Yash Rangineni
Director: KVR Mahendra
Year:  2019

English Script Lyrics Click Here


  కళ్లల్లో కలవరమై సాంగ్ లిరిక్స్కళ్లల్లో కలవరమై కలవరమై
గుండెల్లో పరవశమో వరమై
కళ్లల్లో కలవరమై కలవరమో
వరమే అవ్వగా


కళ్లల్లో కలవరమై కలవరమై
గుండెల్లో పరవశమే వశమై
కళ్లలో కలవరమై కలవరమై
కలిగే కోరిక

ఏకాంతాల చెరలో స్వేచ్ఛగా
ఊహాలే ఎన్నో కొంటె కథలే చెప్పగా
ఆరాటాల ఒడిలో ఆడుతూ ప్రాణమే
ఆనందాల నిధికై చూడగా
ఊరించే ఊసులు ఎన్నో
ఉడికిస్తూ చంపుతుంటే
ఆ తపనలోన తనువు
తుళ్ళి పడుతుంటే

పాల బుగ్గలోని తళుకులే
వెన్నుపూస లోన వణుకులై
కంటిపాప లోన కవితలా మారే
చిన్ని మనసులోని కోవెల
పసిడి వన్నెలోని నవ్వులా
లేత పెదవిపైన ముత్యమై మెరిసే

ఏవో ఏవో ఏవో ఆశలే మెల్లగా
ఎదపై తీపి మధువే చెల్లగా
ఏదో ఏదో ఏదో మైకమే ముద్దుగా
మైమరపించు మాయే చెయ్యగా
అణువణువూ అలజడి రేగి
తమకంలో తేల్చుతుంటే
ఆ ఆదమరపులోన
ఈడు సతమతమై

పాల బుగ్గలోని తళుకులే
వెన్నుపూస లోన వణుకులై
కంటిపాప లోన కవితలా మారే
చిన్ని మనసులోని కోవెల
పసిడి వన్నెలోని నవ్వులా
లేత పెదవిపైన ముత్యమై మెరిసే 
Share This :sentiment_satisfied Emoticon