ఇందరికీ అభయంబు అన్నమాచార్యుల కీర్తనలు లిరిక్స్ | భక్తీ | Aarde Lyrics





Album :: Annamacharya Keerthanalu

Song/ Keerthana :: ఇందరికీ అభయంబు

Get This Keerthana In English Script Click Here

Aarde Lyrics






















రాగం: కాంభోజి రాగం

ఇందరికీ అభయంబు లిచ్చు చేయి
కందువగు మంచి బంగారు చేయి ‖


వెలలేని వేదములు వెదికి తెచ్చిన చేయి
విలుకు గుబ్బలి కింద చేర్చు చేయి |
కలికియగు భూకాంత కాగలించిన చేయి
వలవైన కొనగోల్ల వాడిచేయి ‖

తనివోక బలి చేత దానమడిగిన చేయి
వొనరంగ భూ దాన మొసగు చేయి |
మొనసి జలనిధి యమ్ముమొనకు తెచ్చిన చేయి
ఎనయ నాగేలు ధరియించు చేయి ‖

పురసతుల మానములు పొల్లసేసిన చేయి
తురగంబు బరపెడి దొడ్డ చేయి |
తిరువేంకటాచల ధీశుడై మోక్షంబు
తెరువు ప్రాణుల కెల్ల తెలిపెడి చేయి ‖
Share This :

Related Post



sentiment_satisfied Emoticon

:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
-_-
(o)
[-(
:-?
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
$-)
(y)
(f)
x-)
(k)
(h)
(c)
cheer
(li)
(pl)