అదివో అల్లదివో శ్రీ హరి వాసము అన్నమాచార్యుల కీర్తనలు లిరిక్స్ | భక్తీ | Aarde Lyrics



Album :: Annamacharya Keerthanalu

Song/ Keerthana :: అదివో అల్లదివో శ్రీ హరి వాసము

Get This Keerthana In English Script Click Here

Aarde Lyrics












రాగం: మధ్యమావతి

అదివో అల్లదివో శ్రీ హరి వాసము
పదివేల శేషుల పడగల మయము ‖

అదె వేంకటాచల మఖిలోన్నతము
అదివో బ్రహ్మాదుల కపురూపము |
అదివో నిత్యనివాస మఖిల మునులకు
అదె చూడు డదె మొక్కు డానందమయము ‖

చెంగట నదివో శేషాచలమూ
నింగి నున్న దేవతల నిజవాసము |
ముంగిట నల్లదివో మూలనున్న ధనము
బంగారు శిఖరాల బహు బ్రహ్మమయము ‖

కైవల్య పదము వేంకట నగ మదివో
శ్రీ వేంకటపతికి సిరులైనది |
భావింప సకల సంపద రూపమదివో
పావనముల కెల్ల పావన మయమూ ‖
Share This :

Related Post



sentiment_satisfied Emoticon

:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
-_-
(o)
[-(
:-?
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
$-)
(y)
(f)
x-)
(k)
(h)
(c)
cheer
(li)
(pl)