అంతర్యామి అలసితి అన్నమాచార్యుల కీర్తనలు లిరిక్స్ | భక్తీ | Aarde Lyrics


Album :: Annamacharya Keerthanalu

Song/ Keerthana :: అంతర్యామి అలసితి


Get This Keerthana In English Script Click Here

Aarde Lyrics
రాగం: శివ రంజని

అంతర్యామి అలసితి సొలసితి |
ఇంతట నీ శరణిదె జొచ్చితిని ‖

కోరిన కోర్కులు కోయని కట్లు |
తీరవు నీవవి తెంచక |
భారపు బగ్గాలు పాప పుణ్యములు |
నేరుపుల బోనీవు నీవు వద్దనక ‖

జనుల సంగముల జక్క రోగములు |
విను విడువవు నీవు విడిపించక |
వినయపు దైన్యము విడువని కర్మము |
చనదది నీవిటు శాంతపరచక ‖

మదిలో చింతలు మైలలు మణుగులు |
వదలవు నీవవి వద్దనక |
ఎదుటనె శ్రీ వెంకటేశ్వర నీవదె |
అదన గాచితివి అట్టిట్టనక ‖

Share This :sentiment_satisfied Emoticon