అంతరంగాలు (సీరియల్ గుండెకీ సవ్వడెందుకో) టైటిల్ సాంగ్ లిరిక్స్ - ఈ టీవీ సీరియల్ | సీరియల్ లిరిక్స్ | Aarde Lyrics





Album : Antharangalu (Serial)

Starring: N/A
Music :Vasurao
Lyrics-Suman
Singers :Sunitha
Producer:N/A
Director: N/A

Year: 1998


English Script Lyrics Clcik Here



అంతరంగాలు (సీరియల్ గుండెకీ సవ్వడెందుకో) టైటిల్ సాంగ్ లిరిక్స్



గుండెకీ సవ్వడెందుకో
పెదవులకీ వణుకెందుకో

గుండెకీ సవ్వడెందుకో
పెదవులకీ వణుకెందుకో
పరువానికీ పరుగెందుకో
తనువుకీ తపనెందుకో

గుండెకీ సవ్వడెందుకో
పెదవులకీ వణుకెందుకో
పరువానికీ పరుగెందుకో
తనువుకీ తపనెందుకో

ఏమిటీ కొత్త వింత మదిలో ఏదో పులకింత
అర్థం కాని కవ్వింత ఆశల గిలిగింతా
ఇదేనేమో ప్రేమా నవయవ్వన సీమా
ఇదే సుమా ప్రేమా ఆ మదనుడి మహిమా

గుండెకీ సవ్వడెందుకో
పెదవులకీ వణుకెందుకో
పరువానికీ పరుగెందుకో
తనువుకీ తపనెందుకో

ఇది తొలి తొలి వలపుల
తొలకరి ధ్వని తొలకరి ధ్వని
తపనకు తరగని గని
తలపుల రాజధాని
ఇది తొలి తొలి వలపుల
తొలకరి ధ్వని తొలకరి ధ్వని
తపనకు తరగని గని
తలపుల రాజధాని

అడగకు ఇది ఏమనీ
అంతరంగానికిదే ఆమని
అనంత జీవన వాహినీ
అద్భుతానందావని
ఇది కమ్మని యామిని
జన సమ్మోహిని
జగతికే వరదాయని

ఇదే ఇదే ప్రేమా
నవయవ్వన సీమా
ఇదే సుమా ప్రేమా
ఆ మదనుడి మహిమా

గుండెకీ సవ్వడెందుకో
పెదవులకీ వణుకెందుకో
పరువానికీ పరుగెందుకో
తనువుకీ తపనెందుకో

ఇది వయస్సు చేసే తలపుల తపస్సు
ఎద ఎదనూ పండించే ఎర్రని తేజస్సూ
ఇది వయస్సు చేసే తలపుల తపస్సు
ఎద ఎదనూ పండించే ఎర్రని తేజస్సూ

ఇది మదిలో వెల్లివిరిసే ఇంధ్ర ధనుస్సు
మనసుకి పరమార్థమిచ్చే మధుర ఉషస్సూ
ఇది యవ్వన యశస్సూ ఆశల ఆశీస్సూ
దీనికో నమస్సూ

ఇదే ఇదే ప్రేమా
నవయవ్వన సీమా
ఇదే సుమా ప్రేమా
ఆ మదనుడి మహిమా

గుండెకీ సవ్వడందుకే
పెదవులకీ వణుకందుకే
గుండెకీ సవ్వడందుకే
పెదవులకీ వణుకందుకే
పరువానికీ పరుగందుకే
తనువుకీ తపనందుకే
పరువానికీ పరుగందుకే
తనువుకీ తపనందుకే

ఇదే ఇదే ప్రేమా
నవయవ్వన సీమా
ఇదే సుమా ప్రేమా
ఆ మదనుడి మహిమా 
Share This :



sentiment_satisfied Emoticon