అందే అందే చేతులే ఆకాశానికే (రాధమ్మ కూతురు సీరియల్) సాంగ్ లిరిక్స్ | జీ తెలుగు సీరియల్ | Aarde Lyrics

Album :Radhamma Kuthuru(Serial)

Song Name :: Andhe Andhe Chetule
Starring: N/A
Music :Meenakshi Bujang 
Lyrics-Sagar Narayana Mukku
Singers :Revanth
Producer:N/A
Director: N/A
Year: 2019

Telugu Script Lyrics Click Here


అందే అందే చేతులే ఆకాశానికే (రాధమ్మ కూతురు సీరియల్) సాంగ్ లిరిక్స్అందే అందే చేతులే ఆకాశానికే… 
పొంగే పొంగే ప్రేమలే నీ సొంతానికే
అందే అందే చేతులే ఆకాశానికే… 
పొంగే పొంగే ప్రేమలే నీ సొంతానికే
రాధే రాధే.. ఇది నీ గాధే… 
మమతే ముడుపై ఒదిగే…
ఇక నీ కధనీ నడిపే రమణీ 
అదిగో నదిలా సాగే..
అల్లే అల్లే ఆశలే ఈ బంధానికే బంధానికే…
చల్లే చల్లే రంగులే ఆనందానికే ఆనందానికే…
అందే అందే చేతులే ఆకాశానికే…
పొంగే పొంగే ప్రేమలే నీ సొంతానికే…

అడుగే పడనీ సీకటి పయనం… 
అలసి వెతికే ఓ సాయం…
అదిగో వెలిగే అక్షర దీపం… 
కదిలే కలగా నీ కోసం…
ఎక్కడ నీయడుగుంటుందో అక్కడ పండగ మైనా…
అందరి గుండెల కొలువైన లక్షల అక్షర మీనా..
నీ గెలుపుల హృదయాలే మొదలయ్యేనా…
రాధే రాధే.. ఇది నీ గాధే… 
మమతే ముడుపై ఒదిగే…
ఇక నీ కధనీ నడిపే రమణీ…
అదిగో నదిలా సాగే..
అందే అందే చేతులే ఆకాశానికే…
పొంగే పొంగే ప్రేమలే నీ సొంతానికే…

కంచె చేనే మేసిన తీరై… 
పాశం పగ-లా మారేనే…
మొక్కే దైవం మొర వినకున్నా.. 
దరికే చేర్చే దిశ నీవే…
కంటికి రెప్పల కాచావే… 
భాధను గుప్పిట దాచి..
ఇంటిని వెన్నెల చేశావే…
రెక్కలు ముక్కలు చేసి..
నిను చూసి ఈ పుడమే పులకించేలా…
నీదే నీదే పాదం నీదే.. నిశిలో శశి నీ గాధే…
రాధే రాధే.. ఇకపై మాదే… అదిగో విజయం నీదే…
అందే అందే చేతులే ఆకాశానికే…
పొంగే పొంగే ప్రేమలే నీ సొంతానికే

రాధే రాధే.. ఓ రాధే రాధే.. 
రాధే… రాధే…
ఓ రాధే రాధే.. 
రాధే… రాధే…
రాధే… రాధే…
Share This :sentiment_satisfied Emoticon