వెనకనే ఉన్నా సాంగ్ లిరిక్స్ చూసీ చూడంగానే (2019) తెలుగు సినిమా | Aarde LyricsAlbum : Choosi Choodangaane


Starring: Shiva kandukuri, Varsha Bollamma
Music :Gopi Sunder
Producer: Raj Kandukuri
Director: Sesha Sindhu Rao
Year: 2019


English Script Lyrics Click Here
వెనకనే ఉన్నా సాంగ్ లిరిక్స్


వెనకనే ఉన్నా.. నీ కోసం.. ఒక క్షణమైనా చూశావా..
నీ ఎదురుగా ఓ బెదురుగా నిలబడలేక వెనకే..
నే మసలితే నువ్వసలిటు తిరిగావా.. తిరిగావా…

అలసిన చూపులే నీ వీపుని అనువైనా తాకలేదా…
ఎగసిన ఆశలే నీ శ్వాసలా.. అడుగైనా వెయ్యలేదా… కనుగొనవా..!

వెనకనే ఉన్నా.. నీ కోసం..
ఒక క్షణమైనా చూశావా..

నీ వెంట ఉండేవాళ్ళు.. నాకు మరి స్నేహితులే..
నీతోటి స్నేహం కుదరదెలా…
మాటల్లో ఎన్నో సార్లు.. నీ చిలిపి సంగతులే…
మాటైన నీతో కలవదెలా…

తలచే పేరు.. పిలిచే తీరు.. తెలిసేది ఎన్నడీ-పెదవికి…
కొలిచే నాకు.. వలచి కిటుకు..
నేర్పేది ఎవ్వరీ-జన్మకి ఎంతైనా… ఎంతైనా..

చెలియను రా.. చెలియను రా..
చొరవగ ఎగబడి చెబుతానా

వెనకనే ఉన్నా.. నీ కోసం..
ఒక క్షణమైనా చూశావా..

పోగేసుకున్నానిప్పుడు.. నీ గురుతులెన్నిటినో..
నేన్నీకు చూపే ఋజువులుగా…

వెంటాడుతున్నానిప్పుడు.. నీ కళలనెందుకనో..
నీడైనా రావా నిజములుగా…

పగలు రేయి చదువు మాని… తెగ వేచి వేచి వేసారినా…
నలకంతైనా ఆలాకె రాని..
హృదయాన్ని చేయకోయి చులకన ఏదోలా… ఏదోలా..

తలుపులనీ తెలుసుకొని..
తడబడు మనసుకి ముడిపడవా…

వెనకనే ఉన్నా.. నీ కోసం.. ఒక క్షణమైనా చూశావా..
నీ ఎదురుగా ఓ బెదురుగా నిలబడలేక.. వెనకే..
నే మసలితే నువ్వసలిటు తిరిగావా.. తిరిగావా…

అలసిన చూపులే నీ వీపుని అనువైనా తాకలేదా…
ఎగసిన ఆశలే నీ శ్వాసలా.. అడుగైనా వెయ్యలేదా… కనుగొనవా..!

వెనకనే ఉన్నా.. నీ కోసం..
ఒక క్షణమైనా చూశావా..

Share This :sentiment_satisfied Emoticon