నీ పరిచయముతో సాంగ్ లిరిక్స్ చూసీ చూడంగానే (2019) తెలుగు సినిమా | Aarde Lyrics



Album : Choosi Choodangaane


Starring: Shiva kandukuri, Varsha Bollamma
Music : Gopi Sunder
Singers :Sid Sriram 
Producer: Raj Kandukuri
Director: Sesha Sindhu Rao
Year: 2019


English Script Lyrics Click Here


నీ పరిచయముతో సాంగ్ లిరిక్స్



నీ పరిచయముతో నా మదిని గెలిచా 
నీ పలకరింపుతో నా దిశను మార్చిన
అడుగు నీతో కలిపి అలసటలెన్నో మరిచా
నలుగురితో నేనున్నా విడిపడి నీకై నడిచా
నీ పరిచయముతో నా మదిని గెలిచా

ఏ గతము ఎదురవధిక నీ తలపే జతపడితే
ఏ గురుతు నిలబడదిక నీ పిలుపు వినపడితే
నాలోని లోతు చూపిన నా పరిచయముతో
నిలువునా నే వెలిగి వెలుగులలో నే మునిగినా
పదనిసలేవో తడిమి పరవశమై పైకెగిరా

నీ చెలిమి ప్రతిక్షణముని నా వరకు నడిపినదీ
నీ మహిమే ప్రతి మలుపుని.. తీరముగ మలిచినది

నాలోని నన్ను చేర్చిన.. నీ పరిచయముతో
నీ పరిచయముతో నా కళను కలిశా
నీ వెలుగు వానలో నే తడిసిపోయిన
అడుగు నీతో కలిపి అలసటలెన్నో మరిచా
నలుగురితో నేనున్నా విడిపడి నీకై నడిచా
చివరిదాకా నిలిచే హృదయమునే నే కలిశా
చెరగని ప్రేమై మిగిలే మనసుని నేనై మురిశా
Share This :



sentiment_satisfied Emoticon