మనసంతా మేఘమై తేలిపోదా సాంగ్ లిరిక్స్ కళ్యాణవైభోగమే (2016) తెలుగు సినిమా | Aarde Lyrics
Album: Kalyana Vaibhogame


Starring:Naga Shourya, Malavika Nair
Music:Kalyani Koduri
Lyrics-Lakshmi Bhoopal
Singers :Chinmayi Sripada
Producer:Damodar Prasad
Director:Nandini Reddy
Year: 2015


English Script Lyrics Click Here
మనసంతా మేఘమై తేలిపోదా సాంగ్ లిరిక్స్ మనసంతా మేఘమై తేలిపోదా
తనచూపే తెమ్మెరై తాకగా
ఎండల్లో చల్లగా చిరుజల్లే వెచ్చగా
పులకింతే కొత్తగా అందుకేనా...

మనసంతా మేఘమై తేలిపోదా
తనచూపే తెమ్మెరై తాకగా

ఇంత మోసం ఎవరికోసం
మనసుకే నేను చులకనా
ఎంత దూరం ఈ ప్రయాణం
కోపమా నా పైనా..
నువ్వే లేని నాలోనేను
ఉండలేననా
భారమైన ఊపిరి చూసీ
దాచుకున్న ఇష్టం తెలిసీ
అతని వైపు నన్నే లాగేనా
నిదురపోని కళ్ళను చూసీ
కలలు వచ్చి నిందలు వేసీ
అతని పరిచయాలే అడిగేనా

...తేలిపోదా...
...తాకగా...

వేణుగానం వెదురులోనే
దాగి ఉందన్న సంగతి
పెదవిపైనా అతని పేరే
పలికితే తెలిసింది
ఉయ్యాలూగె నా ఊహల్లో
ఊపిరైనది
బుగ్గమీద చిటికేస్తాడు
సిగ్గులోన ఎరుపవుతాడూ
ఎందుకింత సొంతం అయ్యాడే
రెప్పచాటు స్వప్నం వాడూ
కమ్ముకున్న మైకం వాడూ
ఏవిటింత పిచ్చై పోయానే

తనచూపే... తాకగా...
ఎండల్లో చల్లగా చిరుజల్లే వెచ్చగా
పులకింతే కొత్తగా అందుకేనా...
మనసంతా మేఘమై తేలిపోదా
తనచూపే తెమ్మెరై తాకగా

Share This :sentiment_satisfied Emoticon